Take a fresh look at your lifestyle.

‌త్యాగానికి , సమానత్వానికి సూచిక బక్రీద్‌

“భారతదేశం సర్వమతాల సమ్మేళనం. ప్రతిమతానికి కులానికి ఏవో కొన్ని ఆచారాలు, పద్దతులు, వ్యవహారశైలులు ఉంటాయి. అందులో భాగంగా ప్రజలు ఆయా సాంప్రదాయ వ్యవహారాలను పాటిస్తూ ఆనందిస్తూవుంటారు. అలాఇస్లాం మతస్తులు జరుపుకునే పండుగలలో ముఖ్యమైనవి రెండు. అవి 1. ఈదుల్ఫితర్‌ , 2. ఈదుల్జుహా.ఈదుల్ఫితర్‌ ‌తరువాత రెండు నెలలకు ఈదుల్‌ ‌జహావస్తుంది. ఈదుల్‌ ‌జహా మనిషి యొక్క త్యాగనిరతిని గురించి తెలియజేసే పండుగ. దీనికే మరో పేరు ‘బక్రీద్‌’.”

‌భారతదేశం సర్వమతాల సమ్మేళనం. ప్రతిమతానికి కులానికి ఏవో కొన్ని ఆచారాలు, పద్దతులు, వ్యవహారశైలులు ఉంటాయి. అందులో భాగంగా ప్రజలు ఆయా సాంప్రదాయ వ్యవహారాలను పాటిస్తూ ఆనందిస్తూవుంటారు. అలాఇస్లాం మతస్తులు జరుపుకునే పండుగలలో ముఖ్యమైనవి రెండు. అవి 1. ఈదుల్ఫితర్‌ , 2. ఈదుల్జుహా.ఈదుల్ఫితర్‌ ‌తరువాత రెండు నెలలకు ఈదుల్‌ ‌జహావస్తుంది. ఈదుల్‌ ‌జహా మనిషి యొక్క త్యాగనిరతిని గురించి తెలియజేసే పండుగ. దీనికే మరో పేరు ‘బక్రీద్‌’. అల్లాహ్‌ ‌పంపిన ప్రవక్తల్లో ఒకరైన హజరత్‌ ఇ‌బ్రహీంత్యాగ నిరతికి ప్రతీకగా జరుపుకునే పండగ బక్రీద్‌. ఇస్లాం క్యాలెండర్లోనిబక్రీద్‌ ‌మాసంలో 11వరోజున ఈ పండగను జరుపుకోవడం ఆనవాయితీ. సమాజంలో పేరుకుపోతున్న రుగ్మతలనుంచి జనవాళిని జాగృత పరుస్తూసన్మార్గంలో నడిపించేందుకు అల్లాహ్‌ ‌భూమండలానికి 80వేలమంది ప్రవక్తల్ని పంపినట్లు ముస్లింల ఆరాధ్య గ్రంథం దివ్యఖురాన్‌ ‌చెబుతోంది. వారిలో ఒకరు ప్రవక్త హజరత్‌ ఇ‌బ్రహీం. అల్లాహ్‌పై విశ్వాసంతో సన్మార్గంలో జీవనం గడపాలని మానవాళికి బోధిస్తున్న ప్రవక్తల్లోని విశ్వాసాన్ని కూడా గ్రహించేందుకు అల్లాహ్‌ అనేక పరీక్షలతో పరీక్షించేవారు.

చాలా సంవత్సరాల తరువాత హజరత్‌ఇ‌బ్రహీం, ఆయన సతీమణి హజీరాలకు వృద్ధాప్యంలో అల్లాహ్‌ఇస్మాయిల్రూపంలో సంతాన ప్రాప్తి కలిగించారు. ఒకరోజురాత్రి ఇబ్రహీంతమ కుమారుడు ఇస్మాయిల్‌ను అల్లాహ్‌ ‌పేరబలిదానం చేస్తున్నట్లు కలగంటారు. దీంతో అల్లాహ్‌తన కుమారుడిని బలిదానం కోరుకుంటున్నారని గ్రహించిన ఇబ్రహీం తన కుమారుడు ఇస్మాయిల్‌ను బలిదానం (ఖుర్బానీ) ఇచ్చేందుకు సిద్ధపడ్తారు. తండ్రి అంతరంగాన్ని గమనించిన కుమారుడు ఇస్మాయిల్‌ ‌కూడా అల్లాహ్‌ ‌మార్గంలో బలయ్యేందుకు సిద్ధపడ్తారు.

బలిఇచ్చే సమయంలో పుత్రవాత్సల్యం అడ్డువస్తే. తనకు బలి ఇవ్వకుండా తన తండ్రి వెనకడుగు వేస్తే, అల్లా•హ్‌పై విశ్వాస ఘాతకుడిగా నిలవకుండా, కళ్లకు గంతలతో తనను బలిఇవ్వమంటూ తండ్రికి సూచిస్తారు. ఆమేరకు అల్లాహ్‌ ‌నామస్మరణతో తన కుమారుడిని బలి ఇచ్చేందుకు గొంతుపై కత్తిపెట్టిన క్షణంలో త్యాగనిరతికి మెచ్చిన అల్లాహ్‌ ఆఖరుక్షణంలో అల్లాహ్‌ ఇస్మాయిల్‌ను తప్పించి అదేస్థానంలో ఒకదుంబా (పొట్టేలు) ను ప్రత్యక్షపరుస్తారు. దీంతోపొట్టేలు గొంతు తెగి అల్లాహ్‌మార్గంలో అది ఖుర్బాన్‌ అవుతుంది. ఇబ్రాం త్యాగనిరతిని మెచ్చినఅల్లాహ్‌ ఆరోజునుంచి ఈదుల్‌ అజ్హా (బక్రీద్‌) ‌పండగ రోజున జంతు బలి ఇవ్వాలని, ఈ విధానాన్ని ప్రళయం వరకు కొనసాగించాలనీ, నిర్దేశించినట్లు ఇస్లాం చెబుతోంది.

రంజాన్‌ ‌పండగలాగానే బక్రీద్‌ను కూడా పేదవారికి సహాయం చేయడాన్ని , ఉన్నంతలో కొంత భాగాన్ని పేదవారికి దానం చేయాలని ఆదేశిస్తుంది. అందుకే బక్రీద్‌ ‌పండగ నమాజ తరువాత ప్రతి ముస్లిం ఆచరించే ‘‘ ఖుర్బాని ‘‘ లో మాంసాన్ని మూడు సమాన భాగాలుగా విభజించి అందులో తన కుటుంబానికి ఒక భాగం, బంధువులకు ఒక భాగం, మూడవ భాగం నిరుపేదలకు పంపిణి చేయాలని దివ్య ఖురాన్‌ ఆదేశిస్తుంది. పెరుగుతున్న నిత్యావసర ధరలు, ద్రవ్యోల్పణం కారణంగా మాంసాన్ని కొనలేని పేదలు ఖుర్బాని ద్వారా పొందే మాంసంతో సంతోషంగా పండగ జరుపుకుంటారు.

ప్రతిముస్లిం, జీవిత కాలంలో ఒక్కసారైనా పవిత్రమైన మక్కాను సందర్శించాల్సి ఉండగా, ధనవంతులు బక్రీద్‌ ‌మాసంలోనే అతిపవిత్రమైన మక్కాను సందర్శిస్తారు. ఈయాత్రనేహజ్యాత్ర అని అంటారు. కోవిడ్‌ ‌పాండమిక్‌ ‌వల్ల ్లముస్లిం సోదరులు హజ్‌యాత్రను చేయలేకపోతున్నారు. గత సంవత్సరం నుంచి పండ• •నమాజ్లను కూడా ఇంట్లోనే జరుపుకుంటున్న ముస్లిం సోదరులు ఈ పండగ నమాజ్‌ను ఈద్గాలో నిర్వహించుకోవడానికి అనుమతి లభించడం విశేషం.

dr-md
డాక్టర్‌ ఎం‌డి ఖ్వాజా మొయినొద్దీన్‌
‌ప్రొఫెసర్‌, అకౌంటింగ్‌అం‌డ్‌ ‌ఫైనాన్స్
9492791387

Leave a Reply