Take a fresh look at your lifestyle.

‘‘బకరాలెవ్వలు’’…?

దుకాండ్లల్ల చీప్‌ ‌లిక్కర్‌ ‌కల్తీపై, అడ్డగోలు ధరలు పెంచే సిండికేట్‌ ‌యవారాల మీద సర్కార్‌ ‌నజర్‌ ‌బెట్టది గని, బార్‌ ‌షాపులున్న మూల మలుపుల తాగుబోతుల నోట్లె పుల్లబెట్టి జుల్మానాలు, కోర్టుకు పంపుడు మీద నజర్‌ ‌మాగనే బెడ్తది. ఆఖరుకు తాగుబోతుల జీవితాలను సూత యాపారం సరుకు జేసుకున్న పెట్టుబడిదారోళ్ళ యవ్వారాలకు సర్కార్‌ ‌సాత్‌ ‌దారు అయిందనే జెప్పాలె. దుకాండ్లల్ల తొంబయి శాతం గిరాకి జేషేది గరీబు గాండ్లేనని సర్కార్‌ ‌లెక్కలే జెప్పబట్టె! చీప్‌ ‌లిక్కర్‌ ‌నిబ్బుల తోనే రోజుకు మూడుమలుకల దుకాండ్లల్ల గల్లనిండుతాంది.

తాగుబోతుల త్యాగంతోని ‘‘యాపీ న్యూ ఇయర్‌’’ ‌సంబురాలల్ల పెరిగే ఆమ్దాని తక్కువేం కాదు. గీ ఇగురం ఎరుకైందేనాయే! అందుకే ఖజానా నింపే సందు దొరికిందని అడుగాలిషెం లేకుంట ముందు సూపుతోని మందు ధరలు పెంచి సర్కార్‌ ‌జేషిన షాందార్‌ ‌పనికి చేతులెత్తి మొక్కాలె! పర్మిట్‌ ‌రూంలల్ల పదిమంది కూసుంటె ఖాజానా బుగులు పడ్తదని పర్మిట్‌ ‌రూంలను ఫంక్షన్‌ ‌హాలంత పెద్దగ జేషేటి దుకాణపోల్ల త్యాగం చిన్నదేం కాదు మరి. ఏదో ఓ రోజు ‘రాష్ట్రంల తాగుబోతులే నిజమైన ‘‘దేశభక్తులని’’ సర్కార్‌ ‌మనుసులున్న మాటను బయటికి అంటె గిట్ల అనుడేందుల్లా! అని ఇచ్చంత్రమనిపిచ్చినా అది నిజమోలిగె ఒప్పుకోవాలె! దేశభక్తులెక్కడైనా దేశం కోసం రాత్రనక పగలనక రెక్కలు ముక్కలు జేసుకుంటరు గద! అంటె! ‘‘ఔ! అదే పని మీదున్నం’’! అనే తాగుబోతులందరికి ఎంత ధైర్నమచ్చెరా!  అనిపిత్తాంది! ఊర్లున్న పర్మిట్‌ ‌రూం కాడికి బోయి ఓ వీరతాగుబోతు తోని మాట్లాడుతే తెల్వక పోతదా! అనుకోని పర్మిట్‌ ‌రూం దొరికిచ్చుకోని రొండోకోటర్‌ ‌కొట్టిన ఓ దేశభక్త యాకయ్యను పల్కరిచ్చిన.

‘‘ఔను సారూ! పొద్దంత మా ఇంటిని సాకేటందుకు కూలి పనికి బోతం గద! చీకటి పడ్డంక సర్కార్ను సాకేటందుకే తాగుతానమనుకోవాలె! మేం తాగే కోటర్ల ఇమానంగ జెప్తాన! తాగుబోతులు రోజూ తాగకుంటె సర్కార్‌ ‌నడుసుడెట్ల? మన సర్కార్‌ను సాకేందుకు మేం తాగుతానట్టే గదా! సర్కార్‌ ‌బతికేదే మామీద! నిజంగ కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంల ఎక్కువలెక్కువ వచ్చేటి ఆమ్దానంత మా తాగుబోతులదే నాయె! కాదని ఎవలంటరో అనుమనండి ! తాగుడు మీదచ్చే ఆమ్దానీ లచ్చలల్ల కేలి దాటి కోట్లల్ల పడ్డది, జర్రాగుండ్రి సారూ! మీరొట్టి చేతులతోనుంటె యెట్ల?’’ అని ‘‘ఓ సీకన్న తినరాదుండ్లి’’అని ఇయ్యబోతాంటె యెనుకా ముందాడకుంట లేషి బయిట పడ్డ! పదిమంది కూసుంటె పర్మిట్‌ అం‌టరట! కానీ ఈడ వందల మంది ‘‘డోసుభక్తులు’’కూసుంటే పర్మిట్‌ ‌రూం ఎట్లయిందో! ఆబ్కారోళ్ళు తాగుడు తగ్గించేటానికోసం పని జేయాలె అనంటరు! మరి వాళ్ళే దగ్గరుండి మందు దుకాండ్ల వేలం పాటలు జూసుకునుడు, పర్మిట్‌ ‌రూంల సంక్షేమాన్ని కాపాడుడంటె ఇచ్చంత్రం కాదా!? ఇది వరకు సర్కారే సారా దుకాండ్లు నడిపిచ్చినప్పుడు తాళం యేషున్న  జాడీల నికాలస్‌ ‌సార దొరికేది. గల్లీలల్ల ‘‘ప్రసాదు’’లు కల్తీ జేయకుంట ఓ కన్నేషుంచే పని ఆబ్కారోళ్ళ కుండేది. ఆ దుకాండ్ల ముందు నిప్పుల మీద కాల్షే రూపాయికి రొండు షీకులు ఇప్పటి స్టార్‌ ‌హోటలల్ల దొరికే కబాబుల ‘‘బాబు’’ లెక్కుండేటియి.

సారా కాంట్రాక్ట్‌ల కోసం పోటీ యేమంత లేకుండేడిది. గట్లాసొంటి సారా దుకాండ్లు లేకుంట పాయె! మందు దుకాండ్లచ్చి, బెల్ట్ ‌షాపులు పుట్టి కోట్లల్ల యవారం అయెటందుకు కారణమెవలు! తయారు జేషేటోళ్ళు ఇరువై రూపాలకు కోటర్‌ ‌సీసా అమ్ముతె, తాగెటోళ్ళకు ఆ కోటర్‌ ‌సీసా పదింతల పిరమై నూటిరివై రూపాలు కాబట్టె! వందరూపాలు పంచుకునే కాడ సర్కార్‌  ‌దళార్లతోని పోటీలు పడ్తాంటె ‘‘ఖజానా నింపేటందు’’ కనంటరు. ఏ ఖజానా నింపినా గరీబోళ్ళ చమటవాసన లేని నోట్లుంటయా!’’ ‘‘మద్యపానం ఆరోగ్యానికి హానికరం’’ తాగి బండ్లు నడుపుతే యాక్సిడెంట్లయి, పాణాల మీదికత్తది. ఇసొంటి ప్రచారాలెన్నచ్చినా తాగుడు బందుపెట్టనోళ్ళు, సీసాల మీద ధరలు పెరిగి, గింత గనం పిరమైనయి ఇంగ తాగుడు బందు వెట్టాలని అనుకుంటరా! సారా వ్యతిరేక ఉద్యమంల, కొన్నేండ్లు మందు అమ్ముడు బందు వెట్టినప్పుడు లీడర్ల పంట పండింది పో! వేరే రాష్ట్రంల కేలి తెచ్చి, సాటుంగ అమ్మి, లక్షలు సంపాయించినోళ్ళే గిప్పుడు కండువాలేసుకొని నీతులు జెప్పబట్టిండ్లు.

‘దిశ’ కేసు నడిషిన కాలంల మందు అమ్మకాలకు వ్యతిరేకంగ ఉద్యమాలు జేషిన రాజకీయ పార్టీలు ‘నిజాయితీ’ని జూషి అందరు నవ్వినోళ్ళేనాయే! మందును బరాబరి బందు పెట్టాలని గాకుంట మందు అమ్మకాలపై నియంత్రణ పెంచాలని ఉద్యమం జేషిన ‘లీడరమ్మ’ వాళ్ళ నాయన, పెనిమిటి, తోడబుట్టినోళ్ళందరు సూత మందు దందాల యేండ్ల సంది ‘‘డాన్‌’’‌లేనాయె! గింత గనం యెనుకముందు ఇగురం బెట్టుకోని లీడరమ్మ జేషిన ఉద్దెమం సాలు, లీడర్ల, పార్టీల లోపటి సంగతులు ఎంతగనం ఏరుకజేసెనో!తాగిన రిమ్మల్నే నేరాలు, ఘోరాలు పెరుగబట్టెనని రోజు పేపర్ల, టీవి వార్తలల్ల జూడబడ్తిమి. రిమ్మచ్చినోల్లకు వాయివరుసలేడ కాలవడుతయి, తొమ్మిదేళ్ళ పొల్ల అయినా తొంబయేండ్ల ముసలైనా ఒక్కతీర్గనే ఔపడే పాడుకాలమచ్చె! రిమ్మల అస్తి కోసం అయ్యవ్వలను, తోడబుట్టినోళ్ళను సూత సంపిన కేసులెన్ని లేవు! తాగుతె తప్పంటది సమాజం.

యాక్సిడెంటయితది! పైలంమంటది ఇల్లు. తాగి బండి నడుపుతే ‘నోట్లె పుల్ల బెట్టి లచ్చలల్ల ఆమ్దానీ కమాయిస్తం’ అనబట్టె చలాన్లు రాషే ట్రాఫిక్‌ ‌పోలీసులు. తయారు జేషెటోన్నుంచి కొనెటోళ్ళ దాంక మధ్య బోకరుగాండ్లతో సహా అందరి కందరు మాగనే వున్నరు. ఎవలి ఆమ్దానీ వాళ్ళకున్నది. గివీళ్ళ మద్దెన బకరా అయిటోలంత గరీబోళ్ళే! గింత పరేషాన్‌ ‌జేషే మందు తయారు జేసుడు, అమ్ముడు పూరంగ బందు పెడితె మంచిగుంటదని సర్కార్‌కు ఎవలు జెప్పాలె! మందు దందా మీద కోట్ల రూపాల ఆమ్దానీ వున్నంక సర్కారుకెంత జెప్తె మాత్రం చెవు మీద పేను బార్తదంటరా! దుకాండ్లల్ల చీప్‌ ‌లిక్కర్‌ ‌కల్తీపై, అడ్డగోలు ధరలు పెంచే సిండికేట్‌ ‌యవారాల మీద సర్కార్‌ ‌నజర్‌ ‌బెట్టది గని, బార్‌ ‌షాపులున్న మూల మలుపుల తాగుబోతుల నోట్లె పుల్లబెట్టి జుల్మానాలు, కోర్టుకు పంపుడు మీద నజర్‌ ‌మాగనే బెడ్తది.

ఆఖరుకు తాగుబోతుల జీవితాలను సూత యాపారం సరుకు జేసుకున్న పెట్టుబడిదారోల్ల యవ్వారాలకు సర్కార్‌ ‌సాత్‌ ‌దారు అయిందనే జెప్పాలె. దుకాండ్లల్ల తొంబయి శాతం గిరాకి జేషేది గరీబు గాండ్లేనని సర్కార్‌ ‌లెక్కలే జెప్పబట్టె! చీప్‌ ‌లిక్కర్‌ ‌నిబ్బుల తోనే రోజుకు మూడుమలుకల దుకాండ్లల్ల గళ్ళనిండుతాంది. రోజువారీ కూలీలు,డ్రైవర్లు, కార్మికులే దుకాండ్లకు లైన్లు కడుతాండ్లనుకుంటె సర్కార్‌ ‌కచ్చే కోట్ల ఆమ్దానీ మొత్తం చమట వాసనచ్చే నోట్ల కట్టలదే కదా! సర్కారు పెట్టిన సాలు బడ్జెట్‌ ‌ల తొమ్మిదివందల కోట్ల రూపాలు మందు దుకాండ్ల కోసం దరకాస్తుల నుంచి వచ్చిన ఆమ్దానీయే నాయె! నడిపేటప్పుడచ్చే ఆమ్దానీ పొల్లు పొల్లు పో! ఈ లెక్కన సర్కారును నడిపేది తాగుబోతులే అయితానప్పుడు వాళ్ళ త్యాగాన్ని గుర్తించి సర్కారు ‘‘ఉత్తమతాగుబోతు’’  పేరుమీద మండల జిల్లా,రాష్ట్ర స్థాయి అవార్డులు ఇయ్యాలె గద! అనే డిమాండ్‌ ‌ముందుకత్తది.తాగిన రిమ్మల పొడుసు డో,సంపుడో,రేపులు గిట్లజేత్తే వాళ్ళమీద కేసులు లేకుంట జేయాలనే రోజులచ్చినా వత్తయి గావచ్చు.

Bakaralevvalu
సూడ్రా బయ్‌! ఇ‌క్రమార్క్
‘‘ఇప్పటిదాంక ఇంటివి కదా..సర్కార్‌ ‌సంవత్సరం బడ్జెట్‌ ‌పైసలల్ల తొంబయి శాతం పైసలు తాగుబోతులే ఇచ్చినప్పుడు వేరే ఆమ్దానీల పైసలు ఎటు తిప్పుతాంది కావచ్చు !? రాష్ట్రాన్ని పోషించేటి తాగుబోతులే దేశభక్తులని భావిస్తే తప్పేంది? ఎరుకున్నా, లేకున్నా నా ప్రశ్నలకు జవాబులు జెప్పాలె! ’’ అని ఇరుకుట్ల పెట్టిన భేతాళ్‌ ‌శవాన్ని ఎప్పటి తీర్గనే భుజానేసుకోని ‘‘ఇను! భేతాళ్‌’’ అని  దేశం మొత్తంల ఆర్థికంగ అవ్వల్‌ ‌గున్నది మన రాష్ట్రమే..ఫలానా సర్వే రిపోర్టు జూడు బయ్‌! అని పొద్దున జెప్తరు. చీకటి పడ్డంక నిజాలు బయటికెళ్ళే టైంల రాష్ట్రంల ఆర్థిక మాంద్యంవ •ర్లవడి, తిర్లవడి ఆగంజేత్తాంది. కేంద్రం నిధులు ఇయ్యక పాయె! పొద్దుగుంకే యాలకు చెప్తరు. ఏ ఆమ్దానీ ఎటునుంచి వత్తాందో,ఎటు మలుగుతాందో తెలిత్తె నీకు జెప్పకుంటుంటనా! ఎవలి తోని పనుంటె వాళ్ళను దేశభక్తులని అంటె తప్పేం వున్నది? వాళ్ళతోని పనొడిషినంక ‘‘బోడ మల్లయ్యంటె అయిపాయె!’’ అని చెప్పుకుంట, చెప్పుకుంట ఎప్పటి లాగనే…నడ్వబట్టిండు…నడ్వబట్టిండు.
– ఎలమంద, తెలంగాణ
Tags: yelamandha, bhakaralevvaru, articles

Leave a Reply