Take a fresh look at your lifestyle.

అధికారులకు ఎర..అక్రమాలకు తెర

  • అక్రమ నిర్మాణదారుల సరికొత్త వ్యూహం..!
  • ముడుపులతో సరే అంటున్న ఏసీపీ…?

స్థానిక అధికారులకు ఎరవేసి అక్రమార్జనలో మునిగితేలుతున్నారు ప్రైవేటు అక్రమ నిర్మాణదారులు. శేరిలింగంపల్లి  జీహెచ్‌ఎం‌సీ సర్కిల్‌ ‌టౌన్‌ ‌ప్లానింగ్‌ అధికారి, ప్రైవేటు అక్రమ నిర్మాణదారులతో కుమ్మక్కై మామూళ్ల మత్తులో కూరుకుపోయారని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనంగా ఆయా ప్రాంతాలలో అక్రమ కట్టడాలే సజీవ సాక్షాలుగా నిలుస్తున్నాయి. తాజాగా శేరిలింగంపల్లి సర్కిల్‌ ‌పరిధిలోని కొండాపూర్‌ ‌డివిజన్‌, ‌శ్రీరామ్‌ ‌నగర్‌ ‌బ్లాక్‌( ఏ) ‌నందు (ప్లాట్‌ ‌నెంబర్‌ 370-ఏ), ‌తదితర ప్రాంతాలలో టౌన్‌ ‌ప్లానింగ్‌ అధికారుల సహకారంతోనే అనేక అక్రమ భవన నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం, టౌన్‌ ‌ప్లానింగ్‌ అధికారి సదరు బిల్లింగ్‌ ‌నిర్మాణ దారులతో కుమ్మక్కై కాసులకు కక్కుర్తి పడుతున్నారనేది ఇక్కడ బహిరంగ రహస్యం. అందుకే ఇప్పటివరకు ఏ ఒక్క అక్రమ నిర్మాణాలపై కూడా చర్యలు తీసుకోలేదనేది ఆ ప్రాంత వాసులలో చర్చనీయాంశమైంది.

అక్రమ భవన నిర్మాణాలపై  ఫిర్యాదులు ఎన్ని వచ్చాయి..ఎన్ని ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నారని అడిగితే సమాధానం శూన్యం. తనకు ఏమి పట్టనట్లుగా ఆయన వ్యవహరిస్తున్న తీరు ఫిర్యాదుదారులు పాలిట శాపంగా మారింది. టౌన్‌ ‌ప్లానింగ్‌ అధికారి పుణ్యమా అని ఆయా ప్రాంతాలలో అడుగడుగునా అక్రమ నిర్మాణ భవనాలే దర్శనమిస్తున్నాయి. ఇంటి యజమానులు నిబంధనలు గాలికి వొదిలి తమ ఇష్టానుసారంగా బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నా, కాసులకు కక్కుర్తి పడిన టౌన్‌ ‌ప్లానింగ్‌ అధికారులు మాత్రం ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ , అక్రమ పద్ధతిలో జేబులు నింపుకొని అటు వైపుకి కూడా వెళ్లడం లేదని ఆయా ప్రాంత వాసులు ఆరోపిస్తున్నారు.  ఎటువంటి నిర్మాణ అనుమతులు లేకుండా జి ప్లస్‌ ‌ఫైవ్‌ అం‌తకంటే ఎక్కువ అంతస్తులు వేసి, ఎటువంటి సెట్‌ ‌బ్యాక్‌ ‌లేకున్నా కమర్షియల్‌ ‌బిల్లింగ్‌ ‌లను ,సెల్లార్‌ ‌లతో తో నిర్మిస్తూ నిబంధనలను గాలికి వదులుతున్నారు.

అక్రమ కట్టడాలను ప్రారంభ దశలో అరికట్టాల్సిన అధికారులు మాత్రం అమ్యామ్యాలకు అలవాటు పడి, అక్రమ పద్ధతులను అవలంబించి సొమ్ము చేసుకుంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికితోడు ప్రజాప్రతినిధులను అడ్డుగా పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శలు సాధారణమే. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, స్థానిక టౌన్‌ ‌ప్లానింగ్‌ అధికారులు అక్రమ పద్ధతులను పక్కనపెట్టి, అక్రమ నిర్మాణం దారులపై చర్యలు తీసుకొని, వారి బాధ్యతలు నిస్వార్థంగా నిర్వర్తించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Leave a Reply