సూర్యాపేట, మే 16, ప్రజాతంత్ర ప్రతినిధి):బహుజన విప్లవ వీరుడు మారోజు వీరన్న అని ఇండియా విప్లవోధ్యమానికి నూతన పంథాను సూచించిన విప్లప యోధుడు వీరన్న అని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర నాయకులు పందుల సైదులు అన్నారు. శనివారం మారోజు వీరన్న 21వ వర్థంతిని పురస్కరించుకొని కర్విరాల, కొత్తగూడెంలో వీరన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు భౌగోళిక తెలంగాణ కాదు ప్రజాస్వామిక తెలంగాణ కావాలని, రాష్ట్రంలో బహుజనునలకు రాజ్యాధికారం దక్కాలని వీరన్న పోరాటం చేశారని గుర్తుచేశారు.
చంద్రబాబు ప్రభుత్వం వీరన్నను బూటకపు ఎన్కౌంటర్ చేశారని తెలిపారు. వీరన్నను భౌతికంగా దూరం చేసినా వారి ఆశయాలను ముందుకు తీసుకుపోతామన్నారు. మారోజు వీరన్న చరిత్రను పాఠ్యపుస్తకాలలో పొందుపర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సాగర్. పర్వాతాలు, శ్రీనివాస్, నర్సయ్య పాల్గొన్నారు.