Take a fresh look at your lifestyle.

బడి గంట కొట్టే దెవరు,,….?

“గంట గణగణ మోగగానే  విద్యార్థులందరూ వడివడిగా పాఠశాలకు  చేరుకోవడం ఆనవాయితీగా వస్తోంది.. కానీ తెలంగాణ రాష్ట్రంలో  ఫిబ్రవరి 1 నుండి ప్రారంభం అయిన పాఠశాలల్లో  సర్వీస్‌ ‌పర్సన్స్ ‌నియామకం పూర్తి చేయకపోవడం వల్ల  బడిగంట కొట్టేవాళ్ళు ఉండరు.  బడి గంట   మోగించే వాళ్లులేక, పాఠశాలలు ప్రారంభంలో  బడిగంట  కొట్టేదెవరు..”

గత మార్చి నెలలో కోవిడ్‌ ‌నేపథ్యంలో పాఠశాలలు మూతపడ్డప్పటినుండి ఇప్పటివరకు పాఠశాలలు   తెరుచుకోక పాఠశాలల అభివృద్ధికి  ఎటువంటి చర్యలు తీసుకోలేదు.  9 ,10 తరగతుల నిర్వహణ ప్రత్యక్షంగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించి ప్రత్యేక పరిస్థితుల్లో పాఠశాలల నిర్వహణ పకడ్బందీగా   కోవిడ్‌ ‌నిబంధనలకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకొని పాఠశాలలు ప్రారంభించాలని ఉత్తర్వులు జారీ చేసారు. తరగతి గదులు మూతబడి పది నెలల పది రోజులు. తరగతి గదులు తెరవక అపరిశుభ్రంగా ఉన్నాయి. నిబంధనల ప్రకారం  పాఠశాలలోని ఫర్నిచర్‌, ‌నీటి ట్యాంకులు మరుగుదొడ్లు, గదులు, వంటగది,  సైన్స్ ‌ల్యాబ్‌,‌లైబ్రరీలను  రసాయనాలతో శుభ్రం చేయాలి.

చేతుల శుభ్రతకు నీటి  వసతి, విద్యార్థుల ఉష్ణోగ్రత పరిశీలించడానికి ధర్మామీటర్‌, ‌సామాజిక దూరం పాటించడానికి బల్లలు ఏర్పాటు అవసరం. మధ్యాహ్న భోజన సమయంలో రద్దీ నివారణకు తగిన చర్యలు తీసుకోవాలి. వీటన్నింటి అమలుకు ఉపాధ్యాయులు మాత్రమే సరిపోరు. పారిశుద్ధ్య సిబ్బంది అవసరం. గత సంవత్సరం వరకు సర్వీస్‌ ‌పర్సన్స్ ‌నియామకం కాంట్రాక్టు పద్ధతిన పాఠశాల పరిశుభ్రత సిబ్బందిని నియమించేవారు.  ఈసంవత్సరం వీరి నియామకం జరగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 26,050 పాఠశాలలో సర్వీస్‌ ‌పర్సన్స్ ‌లేరు.ఇప్పుడు పాఠశాల గదుల శుభ్రత ఉపాధ్యాయుల బాధ్యత గా మారింది. ఉపాధ్యాయులు స్వీపర్లు గా పని చేయాల్సిన పరిస్థితి దాపురించడం విచారకరం. మరుగుదొడ్ల శుభ్రత చేయడం అనేది ప్రశ్నార్థకం. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో పాఠశాల పరిశుభ్రత గ్రామ పంచాయతీలకు, పట్టణ ప్రాంతాలలో మున్సిపాలిటీలకు అప్పగించింది.  తగిన సిబ్బంది లేక పారిశుద్ధ్య పనులు అరకొరగా జరుగు తున్నాయి.         

- Advertisement -

ఆన్లైన్‌ ‌తరగతులు ప్రారంభమైనప్పటి నుంచి పాఠశాల పరిశుభ్రత అస్తవ్యస్తమైంది. పాఠశాలలు ప్రారంభమవుతున్న  సమయంలో జిల్లా అధికారులు ప్రధానోపాధ్యాయుల సమావేశం లో కట్టుదిట్టమైన చర్యలుచెబుతూ. ఏ  అపశృతి సంభవించినా  క్రమశిక్షణ చర్య తప్పదని హెచ్చరికలు జారీ చేయడంతో   ప్రధానోపాధ్యాయులు బెంబేలెత్తి పోతున్నారు..బోధనా సిబ్బంది రిటైర్‌ ‌కావడంతో  ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయకపోవడం వల్ల విద్యా బోధన సరిగాసాగదు. ఈ సంవత్సరం విద్యా వాలంటీర్ల నియామకం జరగలేదు.    

                               భావి సమాజం   ఆరోగ్యకరంగా విలసిల్లాలంటే విద్యాభివృద్ధికి పాటుపడాలి. అధిక నిధులు కేటాయించాలి. మధ్యాహ్న భోజన కార్యక్రమానికి నిధులు సకాలంలో అందకపోవడం వల్ల  డ్వాక్రా గ్రూపు మహిళలు మధ్యాహ్న భోజన కార్యక్రమం నిర్వహణకు  ముందుకు రావడంలేద ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు లేక,   పే రివిజన్‌ ‌కమిషన్‌ ‌రిపోర్టు పేలవంగా  ఉండడంతో వారు   మానసిక అశాంతితో ఉన్నారు. తక్షణం  పాఠశాల పరిశుభ్రతకు  ప్రాధాన్యమిచ్చి సర్వీస్‌ ‌పర్సన్స్ ఉత్తర్వులు జారీ చేయాలి.. పాఠశాలలో సదుపాయాల కల్పనకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలి. బోధనా    సిబ్బంది లోపం లేకుండా  విద్యావలంటీర్ల నియామకం  చేపట్టాలి.

thanda sadhanandham
తండా సదానందం, జిల్లా
ఉపాధ్యక్షుడు, టి.పి.టి.ఎఫ్‌. ‌మహబఃబాద్‌ ‌జిల్లా. 9989584665

Leave a Reply