Take a fresh look at your lifestyle.

సన్యాసం స్వీకరించిన బద్వేల్‌ ‌మాజీ ఎమ్మెల్యే

స్వామి శివరామానందంగా మారిన శివరామకృష్ణారావు ఏకంగా ఐదు దశాబ్దాలపాటు రాజకీయాల్లో కొనసాగిన ఓ సీనియర్‌ ‌నాయకుడు సన్యాసం స్వీకరించాడు. ఈ అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బద్వేలు నియోజకవర్గానికి చెందిన డాక్టర్‌ ‌శివరామకృష్ణారావు రాజమండ్రి పుష్కరఘాట్‌ ‌వద్ద శాస్తోక్త్రగా గురువుల ఆశీస్సులతో సన్యాసం స్వీకరించారు. దాంతో ఇకపై ఆయన స్వామి శివరామానంద సరస్వతిగా కొనసాగనున్నారు. శివరామకృష్ణారావు బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. దివంగత వైఎస్‌ ‌రాజశేఖర్‌రెడ్డి సన్నిహితుడిగా ఆయన క్రియాశీల రాజకీయాల్లో కొనసాగారు. తొలిసారి 1972లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. 1977లో బద్వేలు నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత 1983, 1985 ఎన్నికల్లో ఓడినా, 1989 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ తరఫున పోటీచేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994, 1999, 2001 ఎన్నికల్లో ఆయన ఓటమి చవిచూశారు.

అయితే, రాష్ట్ర విభజన తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పటికీ 2015 నుంచే ఆధ్యాత్మిక చింతనవైపు మొగ్గుచూపి మానస సరోవర్‌, ‌చార్‌ధామ్‌, అమర్‌నాథ్‌తోపాటు పలు శక్తి పీఠాలను సందర్శించారు. రిషికేశ్‌కు చెందిన గురువు శ్రీ సద్గురు తత్వవిదానంద సరస్వతి శిష్యరికంలో కొనసాగుతున్నారు. అంతకుముందు శివరామకృష్ణారావు తండ్రి వడ్డెమాను చిదానందం 1952లో తొలి జనరల్‌ ఎలక్షన్లలో బద్వేలు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1955లో మైదుకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందిన ఆయన 1962లో బద్వేలు నుంచి స్వతంత్య అభ్యర్థిగా పోటీ చేసి మరోమారు శాసనసభ్యునిగా ఎన్నిక కావడం గమనార్హం.

బ్రహ్మణ సామాజికవర్గంలో ప్రత్యేక గుర్తింపు పొందిన శివరామకృష్ణారావు ఐదు దశాబ్దాలపాటు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 2004లో వైఎస్‌ ‌ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడంతో జిల్లా రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేశారు. 2009లో బద్వేలు నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడుగా మారడంతో ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. రెండోసారి సీఎంగా ఎన్నికైన వైఎస్సార్‌ ఆయనకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని భావించినా ఆయన అకాల మరణం శివరామకృష్ణారావుకు ఊహించని షాక్‌. ‌కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో ఏపీ స్టేట్‌ ‌మెడికల్‌ ఇన్‌‌ఫ్రాస్టక్చ్ర ‌డెవలప్‌మెంట్‌ ‌కార్పొరేషన్‌ ‌చైర్మన్‌గా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.

2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్‌ ‌కాంగ్రెస్‌పార్టీలో చేరి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 2015 నుంచి ఆధ్యాత్మిక చింతనవైపు మొగ్గుచూపిన శివరామకృష్ణారావు మానస సరోవర్‌, ‌చార్‌దాం, అమర్‌నాథ్‌తో పాటు శక్తి పీఠాలను సందర్శించారు. రిషికేశ్‌కు చెందిన గురువు శ్రీ సద్గురు తత్వవిదానంద సరస్వతి శిష్యరికంలో కొనసాగుతున్నారు. మూడు నెలలుగా పూర్తి ఆధ్యాత్మిక జీవితంవైపు ఆకర్షితులైన ఆయన ఎట్టకేలకు సన్యాస దీక్ష తీసుకోవాలని నిర్ణయించారు.

Leave a Reply