Take a fresh look at your lifestyle.

బడా జూటా పార్టీ..బీజేపీ ..! మంత్రి హరీష్‌ ‌రావు

షాద్‌ ‌నగర్‌, ‌మే 11 : బండి సంజయ్‌ ‌మాట్లాడేవి అన్నీ అబద్ధాలే..పచ్చి అబద్ధాలు..బిజెపి జూటా పార్టీ..అని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు.షాద్‌ ‌నగర్‌ ‌నియోజకవర్గం శంపేట మండలం లో 30 పడకల హాస్పిటల్‌ ‌కి ఆర్థిక, ఆరోగ్య మంత్రి హరీశ్‌ ‌రావు బుధవారం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ..గడ్కరీ కాళేశ్వరం అద్భుతం అన్నారు.. నడ్డా వచ్చి విమర్శలు చేస్తారు..బండి సంజయ్‌ అయితే నాలుకకు నరం లేనట్టు మాట్లాడతరు. .లోకమంతా కాలేశ్వరం పై ప్రశంసలు కురిపిస్తే బండి మాత్రం తప్పుడు ప్రచారం చేస్తారు..తెలంగాణలో నిరంతరం నాణ్యమైన కరెంటు అందిస్తున్నాం…బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎందుకు కరెంటు పోతున్నాయి…బండి సంజయ్‌, ‌డీకే అరుణ పాదయాత్ర చేస్తుంటే కర్ణాటక ప్రజలు వచ్చి తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు మన బిజెపి పాలిత రాష్ట్రంలో అమలు చేయాలని వినతులు ఇచ్చారు…పార్లమెంట్లో ప్రశంసిస్తారు.

గల్లీలో విమర్శలు చేస్తారు…ఢిల్లీలో ఒక మాట గల్లీలో ఒక మాట…రైతుబంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి.. ఇలా అనేక పథకాలు అమలు చేస్తున్నాం. అందులో ఒక పైసా అయినా కేంద్రం ఉందా బండి సంజయ్‌… ఎక్కడికి వస్తావు చెప్పు. .గతంలో మోడీ వచ్చి పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక పూర్తి చేయలేదు. పాలమూరుకు తట్టెడు మట్టి ఎత్తలేదు…సీఎం కేసీఆర్‌హొ మొదలుపెడదాం అంటే అడ్డం పడుతారు. రు. 1050 దాక సిలిండర్‌ ‌ధరలను పెంచి, తెలంగాణ రాష్ట్రమే పన్నులు పెంచిందని తప్పుడు ప్రచారం చేస్తరు..అని విరుచుకుపడ్డారు.షాద్‌ ‌నగర్‌ ‌నియోజకవర్గం శంపేట మండలం లో 30 పడకల హాస్పిటల్‌ ‌కి ఆర్థిక, ఆరోగ్య మంత్రి హరీశ్‌ ‌రావుహొ బుధవారం చేసిన భూమి పూజ చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సబిత ఇంద్రా రెడ్డి, ఎమ్మేల్యేలు అంజయ్య యాదవ్‌, ‌లక్ష్మారెడ్డి, గువ్వల బాలరాజు, జడ్పీ చైర్మన్‌ ‌తీగల అనితా రెడ్డి, ప్రజా ప్రతినిధులు..పాల్గొన్నారు.

Leave a Reply