Take a fresh look at your lifestyle.

ఉద్యోగ నియామకాల హాపై వెనకడుగు

తెలంగాణలో ఉద్యోగ భర్తీల నియామకంలో ఇప్పటికీ వెనకబడే ఉన్నామని వివిధ నిరుద్యోగ సంఘాలు, మేధావులు విమర్శిస్తున్నారు. ఇచ్చిన హాల మేరకు ఉద్యోగాల భర్తీ జరగలేదని, యూనివర్సిటీల్లో ఖాళీలు భర్తీ కావడం లేదని నిరుద్యోగ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు.. ఇది ఉద్యమ నినాదంలో నియామకాలు జరగడం లేదన్నారు. నిజానికి, రాష్ట్రావతరణ తర్వాత ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం ఖాళీ పోస్టులపై సర్వే చేసింది. రాష్ట్రవ్యాప్తంగా  మొత్తం 1,12,536 ఖాళీలు ఉన్నాయని తేల్చింది. వీటిలో ఇప్పటి వరకు 80 వేలకుపైగా పోస్టులకు అనుమతులు మంజూరు చేసింది. వీటిలోనూ సింహభాగం అంటే..42,844 పోస్టుల భర్తీ పక్రియ టీఎస్‌పీఎస్సీకే అప్పగించగా..  36,602 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఇప్పటి వరకూ 27,520 పోస్టులు భర్తీ అయినట్లు టీఎస్‌పీఎస్సీ తన వెబ్‌సైట్‌ ‌ద్వారా ప్రకటించింది. మరో 9,082 పోస్టులు ఫలితాల వెల్లడి, సర్టిఫికెట్ల పరిశీలన, ఎంపిక వంటి దశల్లో ఉన్నాయి. ఇక, మరో 19 వేల పోలీసు పోస్టుల భర్తీ పక్రియ దాదాపు కొలిక్కి వచ్చింది. అలాగే, పంచాయతీరాజ్‌ ‌శాఖ 9,355 పంచాయతీ కార్యదర్శి పోస్టులను భర్తీ చేసింది. మొత్తంద, ఇప్పటి వరకూ 65 వేల వరకూ నియామకాలు జరిగాయి. అయితే, దీనిపై విద్యా నిపుణులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. ఆరేళ్లలో ప్రభుత్వం భర్తీ చేసిన పోస్టులు కేవలం 27,208 మాత్రమేనని చెబుతున్నారు.

ప్రస్తుత రాష్ట్ర జనాభాను పరిగణనలోకి తీసుకుంటే 2.86 లక్షల పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుందని విద్యార్థి సంఘాలు వాదిస్తున్నాయి. కాగా, టీఎస్‌పీఎస్సీ చేపట్టిన పోస్టుల భర్తీ పక్రియ అడుగు ముందుకు, అడుగు వెనక్కి చందంగానే ఉంది. జారీ చేసిన 139 నోటిఫికేషన్లలో చాలా వాటిపై కోర్టు కేసులు నడుస్తున్నాయి. మెరిట్‌ను సరిగా పరిగణనలోకి తీసుకోలేదని గ్రూపు-2 పోస్టుల భర్తీపై కొంతమంది అభ్యర్థులు కోర్టుకెళ్లారు. 2017 డీఎస్సీకి సంబంధించి 8,792 టీఆర్టీ పోస్టుల భర్తీ ఇంకా పూర్తి కాలేదు. దీనికితోడు, జోనల్‌ ‌విధానానికి సంబంధించిన అనుమతులు కేంద్రం నుంచి రాకపోవడమూ పోస్టుల భర్తీకి ఆటంకంగా మారింది. ఇప్పుడు నీళ్ల కల సాకారమవుతోంది. సొంత రాబడులను పెంచుకుంటూ న్యాయపరంగా రావాల్సిన నిధుల వాటా కోసం కేంద్రంతో సర్కారు పోరాడుతోంది. కొలువుల స్వప్నాన్ని సాకారం చేసుకుంటేనే రాష్ట్రాన్ని సాధించుకున్న పరమార్థం నెరవేరినట్లవుతుందని విద్యార్థి నేతలు అంటున్నారు.

Leave a Reply