Take a fresh look at your lifestyle.

వామ్మో.. కొండముచ్చులు…!

  • వరస దాడులతో బెంబెలెత్తుతున్న ప్రజలు
  • ఇండ్ల నుండి బయటకు రావాలంటే భయపడుతున్న ప్రజలు

baboons attackes

సూర్యాపేట కొండముచ్చు కోతుల బెడద నుండి ప్రజలను కాపాడుదామని అనుకున్నారు. కాని కోతులు ఏమో కాని కొండముచ్చుల వల్ల బెంబెలెత్తుతున్న ప్రజలు. వివరాలల్లోకి వెళ్తే జిల్లా కేంద్రం లోని వందల కొద్ది కోతులు ఉం డేవి. అవి చేసే కోతి చేష్టలకు ఇం డ్లలో వస్తువులు అయిన వదల కుండా నాశనం చేస్తూ స్కూల్‌కు వెళ్లే పిల్లలు, రోడ్డు వెంబడి వెళ్తే బాటసారులపై దాడులు చేస్తుం డేవి. కోతుల నుండి తమను కాపా డాలని మున్సిపాలిటీకి వందల కొద్ది వినతి పత్రాలు వచ్చేవి. వా ర్డులలో ఏమైనా సమస్యలు ఉన్నాయయంటే సమస్యలు ఏమో గాని మొదటగా కోతుల బెడద నుండి కాపాడాలని అనేవారు ఎక్కువగా ఉండేవారు. దానిని దృష్టిలో ఉంచుకొని మున్సిపల్‌ ‌పాలకులు, అధికారులు ల•••లు వెం చించి కోతులను పట్టుకునే వారిని, బోనులు తెప్పించారు.

baboons attackes

అయిన కూడా పూర్తి స్థాయిలో కోతులను నిర్మిలించ డానికి సాధ్యం కాకపో వడంతో కొండము చ్చులు అయితే కోతులు ఉండావని భావించి కొండము చ్చులను తీసుకురావడం తో అవి పట్టణంలో వదిలారు. కొండముచ్చుల ద్వారా కోతుల బెడద నుండి ఉపశమ నం పొందంలే అని ప్రజలు అనుకున్నారు. ఇంత వర కు బాగానే ఉంది. అసలు కథ ఇప్పుడు మొదలైంది. ఇటీ వల కుడకుడ రోడ్డులో గల ఒక వైన్‌ ‌షాపులో మద్యం సేవిస్తూ అక్కడికి వచ్చిన కొండముచ్చుకు సరదా కోసం మద్యం త్రాగించడంతో అప్పటి నుండి కొండము చ్చుకు ఏమైందో కాని వాహనదారులు, బాటసారులను లక్ష్యం గా చేసుకొని మొదటగా ఒక రెండు నిమిషాల పాటు సరదాగా ఉన్నట్లు ఉండి ఒకేసారి దాడికి దిగు తుంది. వారం వ్యవధిలోనే సుమారు 20మందిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. కొండముచ్చు దాడి లో గాయాలతో ఆసుపత్రి పాలైయ్యారు. కోతుల బెడద ఏమో కాని కొండముచ్చుల నుండి తమను కాపాడామని ప్రజలు కొరుకుంటున్నారు.

Leave a Reply