Take a fresh look at your lifestyle.

చిన్న వయసులో ఇన్ని సాహసాలా! ప్రధాని మోడీ

ఈ విజయాలు భవిష్యత్‌కు ప్రేరణ బాల పురస్కార గ్రహీతలతో ప్రధాని మోడీ
ఈ విజయాలు భవిష్యత్‌కు ప్రేరణ బాల పురస్కార గ్రహీతలతో ప్రధాని మోడీ

న్యూఢిల్లీ, జనవరి 24 : ఇంత చిన్న వయసులో నమ్మశక్యం కాని పనులు చేసినందుకు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతున్నానని ప్రధాని మోడీ సాహసబాల బాలికలను ప్రశంసించారు. 2020 సంవత్సరానికి గానూ ప్రధానమంత్రి బాల పురస్కారాలను స్వీకరించిన చిన్నారులతో ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో సంభాషించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. క్లిష్ట పరిస్థితుల్లో చేసిన సాహసాలు భవిష్యత్‌లో మంచి పనులు చేసేందుకు ప్రేరణను ఇస్తాయన్నారు. వారి నుంచి తాను ప్రేరణను, శక్తిని పొందుతున్నట్లు ప్రధాని తెలిపారు. సమాజానికి, దేశానికి సేవ చేయాలన్న వారి తపనను చూసి గర్విస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రశంసించారు.

 

విద్యార్థులంతా దేశానికి సేవ చేయాలన్న భావనతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ‘రు(విద్యార్థులు) ఇతర రకాలైన అలవాట్లను అలవర్చుకోరాదని నేను కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు సాధించింది ఏ లేదని గుర్తిస్తూ ముందుకు సాగాలి’ అని ఆయన అన్నారు.  ఇంకా చాలా చేయాలి, దేశానికి చాలా ఇవ్వాలి అనే భావనను తమకు తాముగా ఏర్పర్చుకుని ముందుకు సాగితే చాలా ఆనందం కల్గుతుందని ఆయన విద్యార్థులకు ఉద్భోద చేశారు. ఆ భావన నుంచి కొత్త విషయాలను నేర్చుకునే అవకాశం లభిస్తుంలని, చిన్నప్పుడు మనం నేర్చుకునే అలవాట్లు జీవితాంతం పనికి వస్తాయని, ఆ అలవాట్లే మనసులో స్థిరపడిపోతాయని మోదీ తెలిపారు.

Leave a Reply