Take a fresh look at your lifestyle.

బీజేపీ కి ‘బి’ టీమ్‌ ‌లు బీఆర్‌ఎస్‌ ,‌మజ్లీస్‌

హ్‌దరాబాద్‌ ,‌ప్రజాతంత్ర ,జనవరి20: కాంగ్రెస్‌ ‌పార్టీ రు.16వేల కోట్ల మిగులు బడ్జెట్‌ ‌తో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే… కేసీఆర్‌ ‌ప్రభుత్వం 5లక్షల కోట్లు అప్పు చేసిందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి తారీఖ్‌ అన్వర్‌ ‌శుక్రవారం గాంధీ భవన్‌  ‌విలేఖరుల సమావేశంలో అన్నారు. అయినా ప్రజల ఆశలను కేసీఆర్‌ ‌నేరవేర్చలేకపోయారు అని పేర్కొంటూ తెలంగాణ ఏర్పడి ఎనిమిదేళ్లయినా ఆ లక్ష్యం నెరవేరలేదు..కాంగ్రెస్‌ ‌లేకుండా కూటమి ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉండదు..కాంగ్రెస్‌ ‌ను బలహీనపరిచేందుకు బీఆరెస్‌ ‌ప్రయత్నిస్తోంది..కాంగ్రెస్‌ ‌పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ.పార్టీలో వేరువేరు వాదనలు వినిపించినా.. పార్టీ కోసం అంతా కలిసికట్టుగా పని చేస్తారు..ఎంఐఎం పార్టీ బీజేపీ కి బీ టీమ్‌..‌బీజేపీకి మేలు చేయడమే ఆ పార్టీ పని..భారత్‌ ‌జోడో యాత్ర స్ఫూర్తిని దేశంలో ప్రతీ గ్రామానికి తీసుకెళ్లేందుకే హాత్‌ ‌సే హాత్‌ ‌జోడో యాత్ర..అని అన్వర్‌ అన్నారు. ఏ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి ,సీనియర్‌ ‌కాంగ్రెస్‌ ‌నాయకులు వి హెచ్‌ ‌హనుమంత రావు,షబ్బీర్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.

టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ ‌రెడ్డి సమక్షంలో చేరికలు.
టీఆరెస్‌ ‌నుంచి హుజూరాబాద్‌ ‌నియోజకవర్గానికి చెందిన పలువురు సీనియర్‌ ‌నాయకులు కాంగ్రెస్‌ ‌లో చేరారు .వారిని జూబ్లీహిల్స్ ‌నివాసంలో కండువా కప్పి పార్టీలోకి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి ఆహ్వానించారు .

హైదరాబాద్‌ ‌చేరుకున్న ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ‌మాణిక్‌ ‌రావు ఠాక్రే.
శుక్రవారం హైదరాబాద్‌ ‌చేరుకున్న ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ‌మాణిక్‌ ‌రావు ఠాక్రే కు శంషాబాద్‌ ‌విమానాశ్రయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి..స్వాగతం పలికారు. శుక్రవారం నుంచి గాంధీభవన్‌ ‌లో మూడురోజుల పాటు టీపీసీసీ, అనుబంధ సంఘాల నేతలతో ఠాక్రే వరస సమావేశాలు నిర్వహించనున్నారు.హాత్‌ ‌సే హాత్‌ ‌జోడో అభియాన్‌ ‌కార్యక్రమంపై నేతలతో చర్చించనున్నారు.

Leave a Reply