Take a fresh look at your lifestyle.

అజరామర నిఘంటువు రవ్వా శ్రీహరి

తెలుగు సాహిత్యం నవీణ గుణాలను పుణికి పుచ్చుకుని, ప్రపం చీకరణ ప్రాపంచిక దృక్కో ణాలను, ను•తన ఒరవడులు అలవర్చుకొని వికసి స్తున్నా ము•లలు చెక్కు• దరకుండా సాహిత్య శ్రేష్టత కోసం కృషిసల్పే మహాకవులను తెలుగుభాషా మాత తన ఒడిలో దాచుకుంటది.. నిలుపుకుంటది..! నిఘంటు నిర్మాణ కృతికర్తగా, సంస్కృత సాహితీ ద్రష్ట,కవిగా, విమర్శకుడిగా, మహామ హోపాధ్యాయుడిగా, సునిషిత పరిశోధకుడిగా, బహుభాషావేత్తగా, అనంత అనన్యసామర్థ్య ము•ర్తిగా, ఆధునిక భాషా సాహిత్యానికి ఎనలేని సేవజేసి లక్షలాది పేజీల తెలుగు సాహిత్యాన్ని రాసి,తెలుగు అక్షరపు•లవనాన్ని పరిపుష్టి చేసిన రవ్వా శ్రీహరి తెలుగు భాషా సాహితీ వికాసంలో చిరస్మరణీయులు ప్రాతఃస్మరణీయులు..
వేలాది శిష్య గణానికి ప్రత్యక్ష గురువుగా, లక్షలాది విద్యార్థులకు గురుస్థానీయులగా, 80 వసంతాల జీవనసాహితీ ప్రవాహంలో జీవద్భాషకు సంజీవినైన రచన రవ్వా శ్రీహరి గారిది.అతిసాధారణ కుటుంబంలో జన్మించి అనంత లోకాలకేగే చివరిశ్వాస వరకు సాహితీ సృజనా పరిశోధన కై పరితపించిన భాషా తపస్వి ..
సృజనాప్రస్థానం
సంస్కృతంలో, తెలుగులో ఉపమానాలకీ, వర్ణనలకీ లోటులేదు. కానీ సంస్కృ తానికీ, తెలుగు భాషకూ ఉన్న అనుబంధం గురించి చెప్పడానికి ఏ ఉపమానమూ చాలదు. ఈ రెండు భాషల కోసం కొన్ని దశాబ్దాలుగా శ్రమిస్తున్న పండితుడు ఆచార్య రవ్వా శ్రీహరి. రచనా ప్రక్రియలో మాత్రం తెలుగు రచనలకు పెద్దపీట వేసి 50 వరకు గ్రంథాలను వెలువరించారు. సంస్కృతంలో 25 పుస్తకాలు రచించారు. నల్లగొండ జిల్లా, వెల్వర్తికి చెందిన ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన శ్రీహరి కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయం ఉపకులపతి స్థానం వరకు ప్రయాణించిన ప్రతిభాశాలి. పరిశోధన, సృజన, విమర్శ, అనువాదం, నిఘంటు నిర్మాణం వంటి రంగాల మీద తనదైన ముద్రవేశారు.  లఘు సిద్ధాంత కౌముది, అలబ్ధ కావ్య పద ముక్తావళి, సాహితీ నీరాజనం, తెలుగు కవుల సంస్కృతానుకరణలు, వాడుకలో అప్రయోగాలు వంటి పుస్తకాలు (తెలుగు) రాశారాయన. సంస్కృతంలో ప్రపంచ పది, మాతృగీతం,  సంస్కృత వైజయంతి (వ్యాస సంపుటి) వంటివాటిని వెలువరించారు. మాండలికాల మీద శ్రీహరి కృషి వెలకట్టలేనిది. తెలంగాణ మాండలికాలు, ఆరె భాషా నిఘంటువు, నల్లగొండ జిల్లా ప్రజల భాష, శ్రీహరి నిఘంటువు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి.  ఆయన రూపొందించిన సంస్కృత న్యాయదీపిక ఒక అద్భుత రచన. సంస్కృత సూక్తి రత్నాకరం కూడా అలాంటి ఉత్తమ గ్రంథమే. మహాకవి గుర్రం జాషువా ‘పిరదౌసి’, తైలపాయికా పేరుతో ‘గబ్బిలం’ కావ్యాలను సంస్కృతంలోకి అనువదించారు. వేమన శతకాన్ని కూడా సంస్కృతంలోకి అనువదించి మహో పకారం చేశారు. సంకీర్తనాచార్యుడు అన్నమాచార్య మీద శ్రీహరి కొత్త వెలుగును ప్రసరింపచేశారు. అన్నమాచార్య సూక్తి సుధ, అన్నమయ్య భాషా వైభవం, అన్నమయ్య పదకో శము ఇందుకు తార్కాణం.
నిత్య విద్యార్థి
సంస్కృత గ్రంథాలను సైతం పరిష్కృతం చేయగల మేధావి అయినప్పటికీని నిత్య విద్యార్థుల పఠణంలో,  పరిశోధనలో ఒదిగిపోయే వ్యక్తిత్వ  జ్ఞానం ఉన్నబహుభాషావేత్త రవ్వా శ్రీహరిగారు.. మహా మహోపాధ్యాయ, కవి పండితులు, నిఘంటు నిర్మాతలు, గుణ గరిష్ఠులు, ఆచార్య వరిష్ఠులు, సంస్కృతాంధ్ర భాషా సాహిత్యాలలో పండితులు నిగర్వి నిరాడంబురులు ఆచార్య రవ్వా శ్రీహరి గారు. సామాన్య కుటుంబం నుండి వచ్చి అసాధారణ ప్రతిభా పాటవాలను ప్రదర్శించి భాషామతల్లి సేవలో జీవనయానం కొనసాగి ంచిన బహుముఖ ప్రజ్ఞాశీలి ఆచార్య రవ్వా శ్రీహరి గారు.
యాదగిరి లక్ష్మీనృసింహ సంస్కృత విద్యాపీఠం నుండి దిద్దుకున్న సంస్కృత భాషా తిలకం ఉపకులపతి పీఠమెక్కి విద్యా ప్రభలు పంచింది.  ఎం.ఎ.(తెలుగు), ఎం.ఎ.సంస్కృతం,  భాస్కర రామాయణం – విమర్శనాత్మక పరిశీలన అంశంపై పరిశోధన చేసి పిహెచ్‌.‌డి పట్టాను పొందిన ప్రతిభ వారిది.  ఆంధ్ర సారస్వత పరిషత్‌ ఒరియంటల్‌ ‌కళాశాలలో ఉపన్యాసకులుగా, ఉపన్యాసక వృత్తిలోకి అడుగిడినారు.  సీనియర్‌ ‌తెలుగు పండితుని నుంచి ప్రొఫెసర్‌  ‌దాకా ఆదర్శవంతమైన అద్భుతమైన బోధన చేసిన ఉత్తమ ఆచార్యులు.  ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా,  ద్రావిడ యూనివర్సిటీ ఉపాధ్యక్షులుగా, హైదరాబాద్‌ ‌లోని తెలుగు విశ్వవిద్యాలయం ఇన్‌ ‌చార్జ్ ఉపాధ్యక్షులుగా పనిచేసిన పరిపాలనా దక్షత వీరిది. రవ్వా శ్రీహరి గారు వివిధ విశ్వవిద్యాలయాలలోని విద్యా సంఘాలతో లెక్కకు మిక్కిలి పదవులు నిర్వహించిన ఘనత వీరిది. శ్రీహరి గారు అనగానే మనకు గుర్తొచ్చేది శ్రీహరి నిఘంటువు. తెలుగు సారస్వత క్షేత్రంలో నిలిచిపోయే అనేక అంశాలను అనుశీలించారు. తెలుగు నిఘంటువులున్నంత కాలం, సూర్యరాయాంధ్ర నిఘంటువుతోపాటు ‘శ్రీహరి నిఘంటువు’ కూడా నిలిచిపోతుందని పరిశోధకుల అభిప్రాయం.
 మరొక అద్భుత గ్రంథం సంకేత పదకోశం.
దీనిలో మనకు కావల్సినన్ని వ్యాకరణ, తర్క, మీమాంస, జ్యోతిష, అలంకారాల ఆయుర్వేద మొదలైన శాస్త్రాలకు సంబంధించిన పదాల కూర్పు జరిగింది. రెండవ ముద్రణలో మరిన్ని అంశాలను చేర్చి పాఠకులకు ఆసక్తిని కలిగించారు. పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య కీర్తనల్లోని అచ్చ తెలుగు పదాలను, క్లిష్టమైన భాషాంశాలను భక్తి భావ సంపన్నతను, సంగీత ప్రావీణ్యతను భాషా ప్రయోగ చతురతను ఎన్నింటినో అన్నమయ్య పదకోశంలో వివరించిన విజ్ఞానవంతులు ఆచార్యులు. తెలంగాణా భాషా ప్రాచీనతను, ప్రామాణికతను ఎత్తి చూపిన శ్రీహరిగారి రచన  తెలంగాణా మాండలికాలు – కావ్య ప్రయోగాలు. తెలంగాణాలో వాడుకలో వున్న ఎన్నో పదాలకు అర్థాలను తెల్పినారు.  నల్లగొండ జిల్లా ప్రజల భాష%••%.. మాండలిక పదకోశం నిర్మించినారు. వ్యాకరణ పదకోశము, వాడుక తెలుగులో అపప్రయోగాలు, లఘుసిద్ధాంత కౌముది, పాణినీయ అష్టాధ్యాయి తెలుగు అనువాదం , కాశీకాసహితం  సంపుటాలు, సంస్కృత రచనలలో సంస్కృత సూక్తి ముక్తావళి సంస్కృత న్యాయాలు, సంస్కృత నీతి రత్నాకరం, సంస్కృత న్యాయదీపిక
అనువాదాలు
డా. సి.నారాయణరెడ్డి ప్రపంచపదులు, జాషువా ఫిరదౌసి, గబ్బిలం, వేమన శతకం , శేషప్ప నరసింహ శతకం, మాతృ గీతం, స్వీయరచనలుసంస్కృతీ వైజయంతితోపాటు అనేక రచనలకు సంపాద కత్వం వహించిన కవి పండితులు, భాషావేత్త, వీరి సాహిత్య వ్యాసాలు చాలావరకు పరిశోధనాత్మకమైనవి, ఆలోచనాత్మకమైనవి. రవ్వాగారి గ్రంథాలలో ప్రామాణికత, శాస్త్రీయ స్పష్టంగా గోచరిస్తుంది. తెలుగులో భాషా సాహిత్యానికి సంబంధించిన వీరి రచన ఉదయభారతి. ఇందులో తెలుగు, సంస్కృతం భాషా సాహిత్యాలకు వ్యాసాలు, వ్యాకరణ సంబంధితాలున్నాయి. తెలుగు కవుల సంస్కృతానుకరణలు, తెలుగులో అలబ్ధ వ్మాయం, భాస్కర రామాయణు – విమర్శనాత్మక పరిశీలనము (సిద్ధాంత గ్రంథము) .శ్రీహరిగారి రచన భాషా విశేషాంశాలు, వ్యాకరణ సంబంధితాలు, సాధికారతతో చెప్పి పరిశోధకులకు, భాషా ప్రియులకు అనేక విషయాలు తెల్పి ఇంకా తెల్పవలసిని అనేకం ఉన్నాయంటూ భావి పరిశోధకులకు వదిలివేసినారు.
నల్లగొండ జిల్లాలోని వలిగొండ మండలం వెలువర్తిలోని నిరుపేద చేనేత కుటుంబంలో 5 మే 1943న రవ్వా వేంకట నరసమ్మ,నరసయ్య దంపతులకు జన్మించినారు. అమ్మమ్మ తాతయ్యల ప్రోత్సాహంతో భువనగిరిలో 5వ తరగతి వరకు చదివినారు. తల్లిగారి మరణంతో చదువుకు అవాంతరం ఏర్పడింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల తండ్రి శ్రీహరి గారిని చదివించలేనని తెలియజేశారు. దినపత్రికలోని యాదగిరి దేవస్థానము సంస్కృత విద్యాపీఠం ఉచిత చదువును భోజనాల్ని కల్పిస్తారని తెల్సుకొని అక్కడ చేరిన ఆచార్యులవారి జీవితం మలుపు తిరిగింది. అక్కడ నుండి బయలుదేరి ఉన్నత చదువులు, ఉన్నతోద్యోగాలు నిర్వర్తించిన ఉభయభాషా ప్రౌఢి.
ఆచార్య శ్రీహరిగారి పంచశతి (75 సంవత్సరాలు) పురస్కరించుకొని ‘శ్రీహరి విజయం’ పుస్తకం వేయడం జరిగింది. దీనిలో అనేక వ్యాసాలు సాహితీవేత్తల అభిప్రాయాలు, రచనలు వీరి సంబంధిత సాహిత్య విశేషాంశాలు పొందుపరచబడినాయి.
అనువాదం, సంకలనం, విమర్శ, పరిశోధన, నిఘంటువు నిర్మాణం వీరి ప్రతీ అక్షరం వినూత్నం. వీరీ విశేష కృషికి పురస్కారాలు వెతుక్కుంటూ వచ్చాయి.  సంస్కృతి విద్యాపీఠ్‌ ‌తిరుపతి వారి మహామహోపాధ్యాయ , కేంద్ర సాహిత్య అకాడమి వారి పురస్కారం (అనువాద రచనకు),  తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పురస్కారం, జాషువా సాహిత్య పురస్కారం,  న్యూజెర్సి అమెరికావారి బ్రౌన్‌ ‌పురస్కారం, సౌశీల్య పురస్కారం, పరవస్తు చిన్నయ సూరి జాతీయ పురస్కారం లాంటి చాలా పురస్కారాలు పొందినారు.
ఆచార్య రవ్వా శ్రీహరిగారంటే నడిచే విజ్ఞాన సరస్వం. వీరి గురించి రాయటం ఒడవని ముచ్చట. ఇలాంటి మహానుభావులపై అత్యంత ఇష్టంతో, జాగరూకతతో అల్పుడిని అంటూ అనల్పమైన శ్రీహరిగారి తెలుగు రచనలు – సమగ్ర పరిశీలనపైన డా.సి.యాదగిరి ఆచార్య సాగి కమలాకరశర్మగారి వద్ద పరిశోధన చేసి పట్టాను పొంది తెలుగు ఉపాధ్యాయులు కాకున్నా డా . యాదగిరి గారు తమ పరిశోధనలో ఎన్నో విషయాలను తేటతెల్లం చేసినారు. ఇంకా రవ్వాగారి మీద చాలా పరిశోధనలు రావాల్సి ఉంది. ఆచార్య రవ్వా శ్రీహరి గారి కలం నుండి ఇంకా ఎన్నోరావల్సి ఉండేది. అనారోగ్య కారణాల వలన ఆయన తుదిశ్వాస విడిచి పోవడం తెలుగు భాషకు ఏనాటికీ పు•డ్చలేని లోటనేచెప్పాలి…భౌతికంగా సమాజాన్ని విడిచిపోయినా..సాహితీ చిరస్మరనీయులు రవ్వా శ్రీహరి గారు. వారి ఆత్మకు శాంతి చేకు•రాలని సాహిత్యాక్షర నివాళిఘటిస్తున్నాము.
image.png
డా.మహేందర్‌ ‌కట్కు•రి
కవి, రచయిత
మోడల్‌ ‌స్కు•ల్‌ ఉపాధ్యాయులు
9618447209

Leave a Reply