నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ప్రారంభించనున్న సీఎం కేసీఆర్,
ప్రజాతంత్ర ప్రతినిధి, హైదరాబాద్ : దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జరుపనున్న ఆజాదీ కా అమృత్ మహాత్సవాలను తెలంగాణలో సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రారంభించనున్నారు.ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.
అలాగే, వరంగల్‌లో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ డా.తమిళిసై పాల్గొననున్నారు. శుక్రవారం నుంచి ఆగస్టు 15 వరకు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కార్యక్రమాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.25 కోట్లను మంజూరు చేసింది. కాగా ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మగా ప్రభుత్వ సలహాదారు డా.కెవి రమణాచారి వ్యవహరించనున్నారు.