Take a fresh look at your lifestyle.

సాంప్రదాయ ఔషదాలకు ఆయుష్‌ ‌గుర్తు

  • ఉత్పత్తుల ప్రామాణికతను గుర్తించేందుకు ప్రవేశపెట్టనున్న భారత్‌
  • ‌గ్లోబల్‌ ఆయుష్‌ ‌సదస్సులో ప్రధాని మోడీ

గాంధీనగర్‌, ఏ‌ప్రిల్‌ 20 : ‌దేశంలో సాంప్రదాయ ఔషధ ఉత్పత్తులను గుర్తించడానికి, నాణ్యమైన ఆయుష్‌ ఉత్పత్తుల ప్రామాణికతను తెలిపే ఆయుష్‌ ‌గుర్తును భారతదేశం త్వరలో ప్రవేశపెట్టనుందని ప్రధాని మోడీ తెలిపారు. బుధవారం అహ్మదాబాద్‌లో జరుగుతున్న ‘గ్లోబల్‌ ఆయుష్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అం‌డ్‌ ఇన్నోవేషన్‌ ‌సమ్మిట్‌’ 3‌వ రోజు సదస్సులో ప్రధాని మాట్లాడుతూ…సాంప్రదాయ చికిత్సల కోసం భారత్‌కు వొచ్చే వారి కోసం త్వరలో ఆయుష్‌ ‌వీసా కేటగిరీని ప్రారంభిస్తుందని ప్రధాన మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ఆయుష్‌ అనేది ఆయుర్వేదం, యోగా మరియు నేచురోపతి, యునాని, సిద్ధ మరియు హోమియోపతి వంటి ప్రత్యామ్నాయ వైద్య విధానాలకు సంక్షిప్త రూపమని, ఈ వ్యవస్థలను ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా ఆయుష్‌ ‌మంత్రిత్వ శాఖను బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అన్నారు.

ఆయుష్‌ ‌గుర్తు దేశంలోని నాణ్యమైన ఆయుష్‌ ఉత్పత్తుల ప్రామాణికతను తెలియజేస్తుందని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరిశీలించిన ఉత్పత్తులకు మాత్రమే మార్క్ ఇవ్వబడుతుందని, దీంతో నాణ్యమైన ఆయుష్‌ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నామని ప్రపంచ ప్రజలకు విశ్వాసం కలుగుతుందని మోదీ అన్నారు. డబ్ల్యూహెచ్‌ఓ ‌డైరెక్టర్‌ ‌జనరల్‌ ‌టెడ్రోస్‌ అధనామ్‌, ‌మారిషస్‌ ‌ప్రధాని ప్రవింద్‌ ‌జుగ్నాత్‌ ‌పాల్గొన్నారు.

Leave a Reply