Take a fresh look at your lifestyle.

ఓటిఎస్‌ ‌పథకంపై అవగాహన కల్పించాలి

ఉన్నతస్థాయి సక్షలో సిఎం జగన్‌ ‌సూచన

అమరావతి, డిసెంబర్‌ 8 : ‌జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ఓటీఎస్‌ ‌పై అవగాహన కల్పించాలని సీఎం వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణం, ఓటీఎస్‌ ‌పథకంపై సీఎం జగన్‌ ‌బుధవారం క్యాంప్‌ ‌కార్యాలయంలో సక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ‌మాట్లాడుతూ.. ఓటీఎస్‌పై అవగాహన కల్పించాలని, ఓటీఎస్‌ అనేది పూర్తి స్వచ్ఛందమని స్పష్టంచేశారు. రూ.10వేల కోట్ల భారాన్ని పేదలపై తొలగిస్తున్నామని పేర్కొన్నారు. రుణాలు మాఫీ చేస్తున్నామని, రిజిస్టేష్రన్‌ ‌కూడా ఉచితంగా చేస్తున్నామని తెలిపారు. క్లియర్‌ ‌టైటిల్‌తో రిజిస్టేష్రన్‌ ‌జరుగుతోందని సీఎం పేర్కొన్నారు. వారికి సంపూర్ణ హక్కులు వస్తాయని, ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎం జగన్‌ ‌తెలిపారు.

అవసరాలకు తనఖా పెట్టుకోవచ్చు.. అమ్ముకునే హక్కు కూడా ఉంటుందని పేర్కొన్నారు. పేదలకు మంచి అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. ఆ అవకాళాలు వాడుకోవాలా? లేదా? అన్నది వారిష్టమని చెప్పారు. వారికి సంపూర్ణ హక్కులు కల్పిస్తూ మేలు చేస్తామని తెలిపారు. భవిష్యత్తులో గ్రామ సచివాలయాల్లో రిజిస్టేష్రన్లు కూడా జరుగుతాయని సీఎం చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీరంగనాథరాజు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply