Take a fresh look at your lifestyle.

కళాకారులచే కొరోనాపై అవగాహన

తుర్కపల్లి, మే9 (ప్రజాతంత్ర విలేకరి) మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి చౌరస్తాలో, మాదాపూర్‌ ‌గ్రామంలో కళాకారులచే కరోనా పై ప్రజలకు శనివారం సిఐ నర్సయ్య అవగాహన కల్పిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనాను అరికట్టాడానికి అందరు సహకరించాలి అన్నారు. అందరు సామాజిక దూరం పాటిస్తూ మస్కులు తప్పని సరిగా పెట్టుకోవాలి అన్నారు. మండలంలో కర్ఫ్యూ రాత్రి 7గంటలు ఉదయం7 గంటల వరకు ఉంటుంది అన్నారు. రోడ్లపైకి వచ్చిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ ‌యాదయ్య, కళాకారులు, పోలీసులు  పాల్గొన్నారు.

Leave a Reply