Take a fresh look at your lifestyle.

మహిళల హక్కుల పట్ల అవగాహన అవసరం

మార్చి 8…అంతర్జాతీయ మహిళా దినోత్సవం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకుంటారు. మహిళలకు ఆర్థిక, రాజకీయ, సామాజికం సహా అనేక రంగాల్లో మహిళల భాగ స్వామ్యాన్ని పెంచడంతో పాటు, వారి హక్కుల గురించి అవగాహన కల్పించడానికి ఈ వేడుకలను జరుపుకుంటారు. అయితే వందేళ్లుగా,  ఈ వేడుకలు  జరుపుకుంటున్నా, నేటికీ మహిళ లు అనేక సమస్యల వలయలలో కొట్టు మిట్టా డుతునే ఉన్నారు.  
అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడానికి  కార్మిక ఉద్యమం నేపద్యం ఉంది. 1908 సంవత్సరంలో మహిళలకు తక్కువ పని గంటలు, మెరుగైన ప్యాకేజీ, ఓటు హక్కు కోసం న్యూయార్క్ నగరంలో 15 వేల మంది మహిళలు భారీ ప్రదర్శన చేశారు. మహిళల ఈ డిమాండ్లకు సానుకూలమై, అమెరికాలోని సోషలిస్టు పార్టీ అధికారం లోకి వచ్చాక 1909వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. ఈ దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిం చాలన్న ప్రతిపాదన  కోపెన్‌హెగెన్‌ నగరంలో 1910లో జరిగిన ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్‌’ సదస్సులో  చేశారు. 17 దేశాల నుంచి ఈ సదస్సుకు హాజరైన 100 మంది మహిళలు ఏకగ్రీవంగా అంగీకరించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్స వాన్ని తొలిసారిగా 1911లో ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జ ర్లాండ్‌ దేశాల్లో నిర్వహించారు. 1917 యుద్ధ సమయంలో రష్యా మహిళలు ”ఆహారం – శాంతి” డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. నాలుగు రోజుల తర్వాత అప్పటి రష్యా సామ్రాట్ నికోలస్ జా 2 సింహాసనాన్ని వదులుకోవాల్సి వచ్చింది. తాత్కాలికంగా ఏర్పాటైన ప్రభుత్వం మహిళలకు ఓటు వేసే హక్కును కల్పించిన నేపథ్యం ఉంది. మహిళలు ఈ సమ్మెకు దిగిన దినం అప్పట్లో రష్యాలో అనుసరించే జూలియన్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 23 ఆదివారం. అయితే గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం అది మార్చి 8వ తేదీ. అందుకే మార్చి 8వ తేదీన అత్య ధిక దేశాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపు కొంటున్నారు.1975వ సంవత్సరం లోనే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి అధికారికంగా నిర్వహించ టం ప్రారంభించింది. ఈ ఏడాది జరిగేది 111వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. 2022 అంతర్జాతీయ మహిళా దినోత్సవం థీమ్:   “సుస్థిరమైన రేపటి కోసం ఈ రోజు లింగ సమానత్వం”… అయితే మహిళ లపై అణచివేతలు  కొనసాగు తుండడం నిత్యకృత్యాలే అవుతు న్నాయి. రాజ్యాంగం ఎన్నో హక్కు లు కల్పించినా వాటిపై  అవగాహన లేక పోవడంతో  మరింత అన్యా యాలకు గురవు తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెస్తున్నా ఆచరణలో సాధ్యం కాని పరిస్థితి. తమపై వివక్షను, వేధింపులను ఎదుర్కో వడానికి వారు ఎలాంటి నేరాలకు ఎలాంటి శిక్షలు ఉంటాయో మహిళా దినోత్సవం సందర్భంగా తెలుసు కోవాల్సిన అవసరం ఉంది.
భారతీయ మహిళలందరికిని సమానత్వం( నిబంధన14), వివక్ష లేకుండుట (నిబంధన 15(1), సమానావకాశాలు కల్పించడం (నిబంధన16), సమాన పనికి సమాన వేతనం (నిబంధన 39(డి), వీటితో బాటు స్త్రీలకు పిల్లలకు అనుకూలంగా ప్రత్యేక నిబంధన లను అనుమతించడం (నిబంధన 15(3), మహిళల గౌరవానికి భంగం కల్గించే ఆచారాలను లేకుండా చేయడం(నిబంధన 51(ఎ) (ఇ), అంతేగాక మహిళలు చేసేపనులలో న్యాయపరమైన, మానవోచిత పరిస్థితులలో రక్షణ కల్పించడం, ప్రసూతి సమయంలో ఉపశ మనానికి (నిబంధన 42) మహిళా రిజర్వేషన్ 73వ రాజ్యంగా సవరణ ప్రకారం  సదుపాయాలను అనుమ తించడం వంటి హామీలను భారత రాజ్యాంగం కల్పించింది.

Leave a Reply