Take a fresh look at your lifestyle.

వ్యవసాయ పంటల నియంత్రణ సాగుపై రైతులకు అవగాహన

మధిర, మే 23 (ప్రజాతంత్ర) : మధిర మండలంలోని వంగవీడు, దిడుగుపాడు, తొర్లపాడు, ఇల్లెందులపాడు గ్రామాల్లో వ్యవసాయ నియంత్రిత పంటల సాగు విధానంపై రైతులకు అవగాహన సదస్సులను శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ ఎఓ సింధూ ర్‌ ‌మాట్లాడుతూ వానకాలంలో రైతులు మొక్కజొన్న పంటను సాగు చేయకూ డదని, మొక్కజొన్న సాగు చేసే రైతులకు రైతు బంధు సొమ్ము రావని తెలిపారు. ఖరీఫ్‌లో మొక్కజొన్న సాగు చేయటం వలన రైతుకు ఎకరాకు రూ.25వేలు వస్తాయని, అదే యాసంగి సాగు చేయటం ద్వారా రూ.50వేలు వస్తుందని తెలిపారు.

మొక్కజొన్న ప్రత్యామ్నాయంగా కంది, పత్తి, పెసర పంటలను సాగు చేసుకోవచ్చునన్నారు. అలాగే వరిపంట సాగే చేసే రైతులు సాంబమసూరి, తెలంగాణ సోనా, సిద్ది, హెచ్‌ఎం‌టి, సోనా రకా లు ఎంపిక చేసుకోవాలన్నారు. మధిర సొసైటీలో జీలుగు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, ఈ నెల 27నుండి సబ్సిడీపై రైతులకు పంపిణీ చేయటం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ అధికారులు వంశీ, కృష్ణ, అమృత, రాజేంద్ర, అన్ని గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, రైతులు పాల్గొన్నారు.

Leave a Reply