Take a fresh look at your lifestyle.

అధిక దిగుబడులు సాధించేలా రైతులకు అవగాహన

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
విజయవాడ,జూన్‌ 23 : ‌తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించేలా రైతులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. విజయవాడలోని రైతు శిక్షణ కేంద్రంలో జరిగిన జిల్లా అగ్రికల్చర్‌ ఎడ్వైజరీ బోర్డు సమావేశంలో మంత్రి కొడాలి నాని మాట్లాడారు. వారం రోజుల్లో వ్యవసాయ పనులు ప్రారంభం కానున్నాయని చెప్పారు. రైతులకు అవసరమైన విత్తనాలు,ఎరువులను సకాలంలో అందిస్తామన్నారు. అవసరమైన సాగునీటిని కూడా విడుదల చేస్తామని చెప్పారు. గతంలో ఎదురైన లోటుపాట్లను దృష్టిలో పెట్టుకుని వాటిని సరిదిద్దుకుంటామన్నారు. రైతు ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఖరీఫ్‌ ‌సీజన్లో ఏ ఏ ప్రాంతాల్లో ఎటువంటి పంటలను వేయాలో ముందుగానే రైతులకు తెలియజేస్తామన్నారు.

రైతులు పండించే పంటలకు రైతుభరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి గిట్టుబాటు ధరలను అందేలా చూస్తామని మంత్రి కొడాలి నాని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రాణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ ‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర రవాణా, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), ఎమ్మెల్యేలు కొలుసు పార్ధసారధి, జోగి రమేష్‌, ‌వసంత కృష్ణప్రసాద్‌, ‌కే అనిల్‌ ‌కుమార్‌, ‌సింహాద్రి రమేష్‌, ‌మొండితోక జగన్మోహనరావు, మల్లాది విష్ణు, మేకా వెంకట ప్రతాప అప్పా రావు, జిల్లా కలెక్టర్‌ ‌జే నివాస్‌, ‌జిల్లా జాయింట్‌ ‌కలెక్టర్‌ ‌డాక్టర్‌ ‌కే మాధవీలత, అసిస్టెంట్‌ ‌కలెక్టర్‌ ఎస్‌ఎస్‌ ‌శోభిక, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply