Take a fresh look at your lifestyle.

పోతిరెడ్డిపాడుపై ఇరు రాష్ట్రాల సిఎంల మధ్య అవగాహన

అందుకే కెసిఆర్‌ ‌మౌనంగా ఉంటున్నారు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌
‌బహిరంగ చర్చకు ప్రభుత్వం సిద్ధమా? : ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌ ‌రెడ్డి 

పోతిరెడ్డిపాడుపై జగన్‌, ‌కెసిఆర్‌ల మధ్య రహస్య అవగాహన ఉందని  తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నదీ జలాల విషయంలో ఏపీకి సీఎం కేసీఆర్‌ ‌సహకరిస్తున్నారని వ్యాఖ్యానించారు. అందుకే పోతిరెడ్డిపాడుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌మౌనంగా ఉన్నారని ఆయన ఆరోపించారు. కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కేంద్రానికి ఎందుకు లేఖ రాయలేదని కేసీఆర్‌ ‌సర్కార్‌ను బండి ప్రశ్నించారు. సీఎం తీరుతో పాలమూరు, రంగారెడ్డి జిల్లాలు ఎడారిగా మారతాయని బండి జోస్యం చెప్పారు. జగన్‌తో ఒప్పందంలో భాగంగానే అపెక్స్ ‌కౌన్సిల్‌ ‌సమావేశాన్ని వాయిదా వేయించారన్నారు. ఏపీ ప్రాజెక్టులకు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తోందని.. ఆగస్టు 12లోపు సీఎం కేసీఆర్‌ అఫెక్స్ ‌కౌన్సిల్‌ ‌సమావేశాన్ని ఏర్పాటు చేయించాలని బండి డిమాండ్‌ ‌చేశారు. నదీ జలాల విషయంలో ప్రభుత్వానికి అన్ని విధాలా బీజేపీ సహకరిస్తోందని బండి సంజయ్‌ ‌చెప్పుకొచ్చారు.

బహిరంగ చర్చకు ప్రభుత్వం సిద్ధమా? : ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌ ‌రెడ్డి
పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్ర జలదోపిడీని
అరికట్టడంలో, సంగమేశ్వరం వద్ద రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవడంలో తెరాస ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌ ‌రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. పోతిరెడ్డిపాడుపై బహిరంగ చర్చకు సిద్ధమా అని తెరాస నాయకులకు బహిరంగ సవాల్‌ ‌విసిరారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థతను, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో చేసిన పొరపాట్లను కప్పిపుచ్చుకునేందుకే అసంబద్ధ, అవాస్తవ వాదన ముందుకు తెస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే చిత్తశుద్ధి నిజంగా ఉంటే, బహిరంగ చర్చకు వొచ్చి నిరూపించాలని వంశీ డిమాండ్‌ ‌చేశారు. తేది, సమయం, స్థలం ఎప్పుడైనా, ఎక్కడైనా, ప్రత్యక్షంగా ఐనా, కోవిడ్‌ ‌పరిస్థితుల వల్ల వర్చ్యువల్‌ ‌జూమ్‌ ‌కాన్ఫరెన్స్ ‌ద్వారా ఐనా తాను సిద్ధమని తెలిపారు. వారి ఇష్ట ప్రకారం ఒక సీనియర్‌ ‌పాత్రికేయుడిని సమన్వయకర్తగా, వారి వేసులుబాటును బట్టి తేది, సమయం, స్థలం తెలియజేయగలరని కోరారు. నిజంగా ప్రభుత్వానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం అడ్డుకోవాలని చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ సాగునీటి రంగానికి గొడ్డలిపెట్టు లాంటి ఈ పనులకు టెండర్లు దాఖలు చేసే ప్రతీ కాంట్రాక్టరుని తెలంగాణలో బ్లాక్‌ ‌లిస్ట్ ‌చేయడమెగాక, గతంలో కేటాయించిన పనులన్నీ రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. పోతిరెడ్డిపాడు సామర్ధ్యం పెంపు, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవడంలో విఫలమైతే, ముఖ్యమంత్రి బాధ్యత వహించి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం సుప్రీమ్‌కోర్టులో దాఖలు చేసింది స్పెషల్‌ ‌లీవ్‌ ‌పిటిషన్‌ ‌కాదని, కేవలం అప్లికేషన్‌ ‌ఫర్‌ ‌డైరెక్షన్స్ అని, ఉద్దేశపూర్వకంగానే కాంట్రాక్టర్లకు అనుకూలంగా చేస్తూ  నీరుగారుస్తున్నారని మండిపడ్డారు. బహిరంగ చర్చ సందర్బంగా, ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన కాకుండా కాంట్రాక్టర్లకు ప్రతినిధిగా వ్యవహరిస్తున్న తీరుని బహిర్గతంచేసి, తెరాస ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెడతామని వంశీ చందర్‌ ‌రెడ్డి హెచ్చరించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!