– వాటర్ వర్క్స్ పనితీరుపై సీఎస్ సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 11 : ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గ్రేటర్ హైదరాబాద్‌లో రానున్న రోజులలో తాగు నీటి సమస్య రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సచివాలయంలో హైదరాబాద్ వాటర్ వర్క్స్ విభాగం పని తీరుపై ఆయన మంగళవారం సమీక్షించారు. మంజీర, సింగూరు, గోదావరి ఫేజ్-2, 3 పనులపై సమీక్షించారు. భూసేకరణ, పైప్ లైన్ల నిర్మాణంపై చర్చించారు. ఇరిగేషన్, రెవెన్యూ, అటవీ, రోడ్లు, భవనాల శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రభుత్వం నిర్దేశించిన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి సహకరించుకోవాలని అన్నారు. సమావేశంలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, హైదరాబాద్ వాటర్ వర్క్స్ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, పీసీసీఎఫ్ డాక్టర్ సి. సువర్ణ, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లా కలెక్టర్లు, మిషన్ భగీరథ ఈఎన్‌సీ కృపాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





