‘‘నియంతృత్వపోకడలు, అణిచివేసే విధానాలు, కక్ష సాధింపు చర్యలు, ఏజెన్సీల దుర్వినియోగం, ప్రలోభాల ద్వారా ప్రతిపక్షాలను, మేధావులను బలహీనం చేయగలగడం ఎల్లవేళలా సాధ్యపడదని గ్రహించాలి. కార్పొరేట్ సంస్థలు ప్రతిసారీ తమను కాపాడలేవన్న వాస్తవాన్ని గుర్తించాలి. పార్లమెంట్‌లోనూ, ఇతర వ్యవస్థల్లోనూ ప్రజాస్వామిక విధానాలను అనుసరించాలి..అన్నిటికి మించి ..’’
దక్షిణాదిలో తాము అధికారంలో ఉన్న ఒక్క రాష్ట్రం కర్ణాటకను కోల్పోయిన తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో గెలవడం బీజేపీకి అంత సులువయ్యే పని కాదు. అయితే ఆ రాష్ట్రంలో గెలిచే పరిస్థితులు, కనీసం నిలదొక్కుకునే పరిస్థితులు అంత సులభంగా కనిపించడం లేదు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత బిజెపిలో చేరిన ఇతర పార్టీల నేతలు పార్టీలో తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోతే ఘర్ వాపసీ అంటారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి కాగితపు పులి నేతలే ఉన్నారు. వారు ఒక్క సీటును కూడా •గెలిపించలేని శక్తిహీనులు..మరోవైపు సంఘటితంగా పోరాడితే ఎంతో కొంత సత్ఫలితం వొస్తుందని కర్ణాటక ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. ఈ వాస్తవాన్ని కాంగ్రెస్ గుర్తించి తీరాలి. అయితే తనను తాను అరివీర భయంకరుడులా చిత్రించుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఇప్పుడు ప్రతి ఎన్నికలూ ఒక అగ్నిపరీక్ష లాంటివి. ఎందుకంటే తాను తప్ప ఎవరూ బిజెపిని గెలిపించలేరనే వాతావరణాన్ని ఆయనే కల్పించుకున్నారు. ప్రతి చోటా ’మోదీ, మోదీ’ అంటూ జనాలు జయధ్వానాలు చేస్తుంటే ఉప్పొంగిపోయారు. తన చుట్టే పార్టీ కేంద్రీకృతమయ్యేలా చూసుకున్నారు. అదే ఇప్పుడు మోదీకి భారంగా పరిణమించే పరిస్థితి ఏర్పడుతోంది.
పరిపాలనను గాలికి వదిలేసి నిత్యం ఎన్నికల పైనే దృష్టి కేంద్రీకరించాల్సిన పరిస్థితి కనపడుతోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఇతర రాష్టాల్ల్రోనూ ప్రతిఫలించకుండా మోదీ అహోరాత్రాలు పనిచేయాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. కన్నడ వోటర్లు ఇచ్చిన ఊపిరితో కాంగ్రెస్ ఇతర రాష్టాల్లో పునరుత్థానం చెందే ప్రయత్నాలు చేయకమానదు. మరో వైపు పలు రాష్టాల్లో ప్రాంతీయ పార్టీలు కూడా తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకునేందుకు పోరాడక తప్పదు. దీనితో 2024 ఎన్నికలు అత్యంత సంక్లిష్టంగా, రసవత్తరంగా ఉంటాయనడంలో సందేహం లేదు. మోదీ అమ్ముల పొదిలోని అస్త్రాలన్నీ అయిపోయిన పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత రాజకీయాల్లో తన పాత్రను, ముఖ్యంగా తన పార్టీ పాత్రను మోదీ పునర్నిర్వచించుకోవాల్సివున్నది
కార్పొరేట్ సంస్థలు ప్రతిసారీ తమను కాపాడలేవన్న వాస్తవాన్ని గుర్తించాలి. పార్లమెంట్‌లోనూ, ఇతర వ్యవస్థల్లోనూ ప్రజాస్వామిక విధానాలను అనుసరించాలి. ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలపై పార్లమెంటరీ కమిటీల ద్వారా విచారణకు ఆదేశించేందుకు, సభల్లో చర్చించేందుకు వెనుకాడకూడదు. డియా స్వతంత్రంగా వ్యవహరించేందుకు తగిన వాతావరణం కల్పించాలి.కర్ణాటక ఎన్నికలు జాతీయ స్థాయిలో మోదీ సారథ్యంలోని బిజెపి పతనానికి సంకేతంగా చూడాలి. కర్ణాటక ఎన్నికలు జాతీయ స్థాయి ఎన్నికలు కావని చెప్పడం ద్వారా పలాయనవాదం అందుకోరాదు. బిజెపి అగ్రనాయకుడిగా ప్రధాని మోదీ సహజంగానే దీనికి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. బిజెపిలోనే కాదు జాతీయ స్థాయిలో మోదీకి మించి అత్యంత ఆకర్షణ గల నాయకుడు మరెవరూ లేరన్న విషయం పదేపదే ప్రచారం చేసుకోవడం మానాలి. ఎన్నికల ఫలితాలు వొచ్చిన తర్వాత కాంగ్రెస్ విజయానికి ఘనత రాహుల్ గాంధీకి ఇవ్వడం జరిగింది.
అలాగే మోదీ ప్రచారం మూలంగా బిజెపి అపజయం మూటకట్టుకుంది కనుక ఆయనకే ఇది అంటగట్టాలి. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత దక్షిణాదిలో బిజెపి తుడిచిపెట్టుకుపోయిందని వాదనలు గుర్తించి మసలుకోవాలి. కర్ణాటకలో తెలుగువారు బిజెపికి వ్యతిరేకంగా వోటు వేశారు. కాబట్టి తెలుగు వారి ఆలోచన ఇదని గుర్తించాలి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పుంజుకుంటుందని గుర్తించి మసలుకోవాలి. మరో ఆరు నెలల్లో జరిగే తెలంగాణ ఎన్నికల్లో బిజెపిని ధీటుగా ఎదుర్కోవడం కోసం బిఆర్‌ఎస్ ,కాంగ్రెస్‌లు యత్నిస్తున్నాయి. కర్ణాటకలో ఓడిపోయినప్పటికీ బిజెపికి ఆ రాష్ట్రంలో ప్రజాబలం ఏ మాత్రం తగ్గలేదన్నది వాస్తవం అంటూ చేస్తున్న ప్రచారాలను కట్టిపెట్టాలి. 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలోని బిజెపికి అగ్ని పరీక్ష పెట్టబోతున్నాయి.
– ప్రజాతంత్ర డెస్క్