Take a fresh look at your lifestyle.

విరక్తి గీతం

ఒక రెప్పవేయని స్వప్నం
మాటిమాటికీ తడుతుంది హృదిని
లేపుతుంది అలల కల్లోలాన్ని
లోపలి సాగర ఘొషను
ఉబికి వచ్చేట్టు ప్రేరేపిస్తూ నిరసిస్తూ
వ్యక్తిత్వానికే పరీక్షా అన్నట్టు
మన వాకిట్లో నిరీక్షిస్తుంది చూస్తూ..!
తప్పులను సరిదిద్దుకోవాల్సిన
దారులు ఎండిపోయాయెప్పుడో
చుట్టూ ఆరని అదృశ్య మంటలు
వినిపించుకోని మనుషుల మానసికం
మారని రోజూవారి వ్యసనం
దీనికి బుద్ధి కాలుష్యమని
పేరేమో బహుశా..!!
అజ్ఞానం కొలమానమేమో…
కాలం స్కేలుపై పడుకున్న
ఎన్ని ఎరుగని జీవచ్ఛవాలో మరి
రాలిపోతూ…
కఠిన కర్మ గర్భంలో
కార్చిచ్చులు లేపుతూ
ఇంకా తమని తాము
కూపంలోకి తోసుకుంటున్న
తరుణంలో
ఒక విరక్తి గీతం ఎక్కడో ఒక
అగాధంలోంచి వినసొంపుగా..!!!

    – రఘు వగ్గు, 9603245215

Leave a Reply