Take a fresh look at your lifestyle.

జిల్లాలో ఆటోలకు అనుమతి లేదు

ఖమ్మం, మే 13ప్రజాతంత్ర (ప్రతినిధి): లాక్‌ ‌డౌన్‌ ‌నేపథ్యంలో ఆరెంజ్‌ ‌జోన్‌గా కొనసాగుతున్న ఖమ్మం కమిషనరేట్‌ ‌పరిధిలో ఆటోలు తిరిగేందుకు, ప్రయాణికులను తరలించడానికి అనుమతి లేదని పోలీస్‌ ‌కమిషనర్‌ ‌తఫ్సీర్‌ ఇక్బాల్‌ ‌తెలిపారు. బుధవారం లాక్‌ ‌డౌన్‌ అమలు తీరుపై సీపీ తన కార్యాలయంలో పోలీస్‌ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా పోలీస్‌ ‌కమిషనర్‌ ‌మాట్లాడుతూ …జిల్లాలో ఆరెంజ్‌ ‌జోన్‌ ‌నిబంధనలకు విరుద్ధంగా ఆటోలు రోడ్లపైకి రావడం తీవ్రమైన చర్యగా పరిగణించాలని పోలీస్‌ అధికారులకు ఆదేశించారు.

అత్యవసర వైద్య సేవల కోసం రోగులను తరలించే ఆటోలకు మాత్రమే మినహాయింపు వుంటుందని, కాబట్టి లాక్‌ ‌డౌన్‌ ఆం‌క్షలు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలని పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సూచించారు. ఖమ్మం జిల్లా గ్రీన్‌ ‌జోన్‌గా రూపాంతరం చెందాలంటే కొంత సమయం పడుతుంది కాబట్టి ప్రభుత్వం ప్రకటించే వరకు ఆటోలకు రోడ్లపై తిరగటం నిషేధమని అందరూ సమన్వయం పాటిస్తూ సహకారించాలని అన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ ‌డీసీపీ మురళీధర్‌, ఏసీపీలు రామోజీరమేష్‌, ‌వెంకటరెడ్డి ,సీఐలు పాల్గొన్నారు.

Leave a Reply