ఆటోమేటిక్ హ్యాండ్ వాష్ యంత్రాన్ని రూపొందించిన విద్యార్థి సాత్విక్ను అభినందించిన కలెక్టర్ శ్రీధర్
నాగర్ కర్నూల్, మే 7.ప్రజాతంత్రవిలేకరి: పట్టణంలో టీ స్టాల్ నడుపుతూ జీవనం సాగిస్తున్న కృష్ణమూర్తి తనయుడు పట్టణంలో ఓ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి సాత్విక్ హ్యాండ్ వాష్ ను తాకకుండానే చేతులు శుభ్రం చేసుకునే విధంగా ఉపయోగపడే ఆటోమేటిక్ హ్యాండ్ వాష్ యంత్రాన్ని రూపొందించి, పలువురిని అబ్బురపరిచాడు. ఈ విద్యార్థి, కరోనా నేపథ్యంలో తరచు చేతులు శుభ్రం చేసుకోవాలనుకునే వారు హ్యాండ్ వాష్ చేత్తో పట్టుకొని వినియోగించాల్సి వస్తున్నందున లాక్ డౌన్ మయంలో సమయాన్ని వృధా చేయకుండా తన ఆలోచనలకు పదును పెట్టి వెంటనే అవసరమైన యంత్రాల కోసం తన తండ్రి చేత ఆన్లైన్లో చిన్న మోటారు సెన్సార్ ను ఆర్డర్ చేశాడు. హ్యాండ్ వాష్ బాటిల్ కు మోటార్ అనుసంధానం చేసి, దానికి సెన్సార్ బిగిం చాడు.
ఫలితంగా హ్యాండ్ వాష్ ను నేరుగా చేతిలోకి తీసుకోకుండానే ఆటోమేటిక్ గా హ్యాండ్ వాష్ చేతిలో పడుతోందని, గురువారం జిల్లా కలెక్టర్ శ్రీధర్,ను క్యాంపు కార్యాలయంలో కలిసి తను రూపొందించిన హ్యాండ్ వాష్ యంత్రం పనితీరును కలెక్టర్కు వివరించాడు సాత్విక్, జిల్లా కలెక్టర్ శ్రీధర్ విద్యార్థి మేధా శక్తిని ప్రశంసించారు.భవిష్యత్తులో అతి తక్కువ ఖర్చుతో ప్రజలకు అందుబాటులో ఉండేలా మరెన్నో ప్రయోగాలు చేసి, జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొని జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ విద్యార్థిని అభినందిం చారు. సాత్విక్ ను ఆదర్శంగా తీసుకొని జిల్లాలోని విద్యార్థులు లాక్ డౌన్ సమ యాన్ని వృధా చేయకుండా ఏదో ఒక రంగంలో ప్రయోగాలతో రాణించాలని, పదో తరగతి విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా త్వరలో జరగనున్న మిగిలిన సబ్జెక్టులపై పట్టు సాధించాలని కలెక్టర్ విద్యార్థులకు పిలుపునిచ్చారు.