భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ నందు బుధవారం నాడు సిఐ టి. స్వామి భద్రాచలం, వి.ఆర్ పురం మరియు కూనవరం ప్రాంతాలకు చెందిన ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ రూల్స్ మరియు రేగులషన్స్ పై అవగాహనా కల్పించారు. అంతేకాకుండా సరైన వాహన కాగితాలు కలిగి ఉండాలని, డ్రైవర్ లు ఓవర్లోడ్ తో వాహనాలు నడపరాదని, మద్యం త్రాగి వాహనాలు నడపరాదని హెచ్చరించారు.అలాగే విధిగా యూనిఫామ్ ధరించాలని సూచనలు చేయడం జరిగింది.
రోడ్లపై ఇష్టం వచ్చినట్లుగా ఆటోలు నిలిపి నట్లయితే వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అంతేకాకుండా కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నందున ఆటోలు ఎప్పటికప్పుడు శానిటేషన్లా చేయాలని ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా వారి గమ్యానికి చేరేంతవరకు జాగ్రత్తగా ఆటో నడపాలని తెలిపారు.గత కొద్ది కాలంగా బస్టాండ్ వెనకాల గల వారి అడ్డాలో వారి మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సై సురేష్ సిబ్బంది పాల్గొన్నారు.