8న ఆటోల బంద్ రాష్ట్ర ఆటో రిక్షా డ్రైవర్ల సంఘాల జేఏసీ

హిమాయత్ నగర్: కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ జనవరి 8న జరుగనున్న దేశవ్యాప్త సమ్మెకు పూర్తిగా ఆటోలు బంద్ చేసి మద్దతు తెలుపుతుందని తెలంగాణ రాష్ట్ర ఆటో రిక్షా డ్రైవర్ల సంఘాల జేఏసీ నేతలు ప్రకటించారు. సోమవారం బషీర్ బాగ్ దేశోద్ధారక భవన్ లో తెలంగాణ రాష్ట్ర ఆటో రిక్షా డ్రైవర్ల సంఘాల జేఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బి. వెంకటేశం, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. సాయిబాబా, తెలంగాణ రాష్ట్ర ఆటో రిడా డ్రైవర్ల సంఘాల జేఏసీ నేతలు ఆర్. మల్లేష్(ఏఐటీయూసీ), ఎండి అమానుల్లాహ్ ఖాన్(టివీడి జీవీపీ), వి. మారయ్య(తెరాసకవి), బి. కిరణ్(ఐఎఫ్టియు), అజయ్ బాబు(సీఐటీయూ), ఏ. సత్తిరెడ్డి(టిఏడిఎస్), శ్రీను(ఐఎఫ్టియు), డి. రమేష్(ఏవీడియు) పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బి. వెంకటేశం మాట్లాడుతూ నిరుద్యోగం కారణంగా గత్యంతరం లేక కుటుంబ పోషణ కోసం పేదలు ఆటోలు తోలుతూ జీవనం సాగిస్తున్న ఆటో డ్రైవర్ల నడ్డి విరిచేందుకే కేంద్రప్రభుత్వం నూతన వాహన చట్టం తీసుకువచ్చిందని దుయ్యబట్టారు. రవాణా అధికారులు, ట్రాఫిక్ పోలీసులు భారీగా విధిస్తున్న జరిమానాలు వల్ల ఆటో డ్రైవర్లు అప్పులపాలై, అలాగే దీనికితోడు ప్రైవేట్ ఫైనాన్సర్ల దోపిడీతో వీధిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చట్టాన్ని ఉపసంహరించుకోకపోత ఉద్యమం తీవ్రతరం హెచ్చరించారు. కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏఐటీయూసీ తోపాటు తమ అనుబంధ సంఘమైన తెలంగాణ రాష్ట్ర ఆటో రిగా డ్రైవర్స్, వర్కర్స్ యూనియన్ జనవరి 8న జరుగునున్న అఖిల భారత సమ్మెలో పాల్గొని విజయవంతం చేస్తామని బి. వెంకటేశం తెలిపారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. సాయిబాబా మాట్లాడుతూ ప్రమాదాల నివారణ పేరుతో కేంద్ర ప్రభుత్వం కొత్త ఎంవి ఆక్ట్ తీసుకవచ్చి వాహనదారులను ప్రత్యేక దోపిడీకి పాల్పడుతున్నదని ఆరోపించారు.
Tags: Autorickshaw Band, 8th january ,himayath nagar, tvd gpv,