రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు 48వ వసంతంలోకి అడుగుపెట్టారు. 48వ పుట్టిన రోజును మంత్రి హరీష్‌రావు అభిమానులు, సన్నిహతులు, శ్రేయోభిలాషులు, పార్టీ శ్రేణులు ఒక పండుగలా జరుపుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి హరీష్‌రావు బర్త్‌డే వేడుకలు చాలా గ్రాండ్‌గా జరిగాయి. హరీష్ బర్త్‌డే సందర్బంగా ఆయన స్పూర్తితో పలువురు మొక్కలను నాటారు. దేవాయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంవిఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వేద పండితులు హరీష్‌ను ఆశీర్వదించగా… రాష్ట్ర జల సంరక్షకుడుగా కీలక పాత్రను పోషిస్తున్న హరీష్‌రావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అటు హైదరాబాద్‌లోని స్వగృహంలో, ఇటు సిద్ధిపేటలో కోలాహలంగా మారింది. హరీష్‌కు సిద్దిపేట జిల్లాకు చెందిన అధికారులతో పాటు తెలంగాణ నలుమూలల నుంచి వచ్చిన పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పుట్టిన రోజులు శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి 12గంటల నుంచే హరీష్‌రావు జన్మదినోత్సవ వేడుకలను నేతలు, కార్యకర్తలు కేక్‌లు కట్ చేస్తూ ఘనంగా నిర్వహించారు.
ఆపద్బాంధవుని పుట్టిన రోజున…ప్రాణ దాతలుగా నిలిచారు…
రికార్డు స్థాయిలో 121 యూనిట్ల రక్త సేకరణ
‘ఆయన ఓ అభివృద్ధి ప్రధాత.. మానవత్వపు శిఖరం… ఆపదలో అండగా ఉండే అపద్భాందవుడు. ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న మహా నాయకుడు హరిష్ రావు అని ఆయన జన్మదినోత్సవం సందర్భంగా ప్రగతి ప్రధాతకు ఎంతో మంది ప్రాణా దాతలు కావాలి అని అభిమానంతో నేను అందించే ఒక బహుమానం రక్త దాన శిబిరం అని కౌన్సిలర్ మచ్చ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. మంత్రి హరీష్ రావు గా జన్మదినోత్సవం సందర్భంగా మచ్చ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సిద్దిపేట రెడ్డి సంఘం భవనంలో మెగా రక్త దాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరీష్ రావు ఒక నాయకుణ్ణి ప్రజా సేవకున్ని.. మానవత్వం గుణాన్ని.. ఆపదలో అండగా ఉండే మనస్సు చూశామనీ, అలాంటి నాయకుని జన్మదినం సందర్భంగా మేము ఇచ్చే గొప్ప బహుమానం ఎంతో మంది ప్రాణ దాతలు నిలబడమే అని..ఈరోజు రక్త దాన శిబిరం ఏర్పాటు చేసాం అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ యూత్ రాష్ట్ర నాయకుడు శేపూరి శేఖర్‌గౌడ్, తీపి మహేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కొండం సంపత్ రెడ్డి అధ్యర్యంలో కేక్ కటింగ్…
మంత్రి హరీష్‌రావు పుట్టిన రోజును పురస్కరించుకుని సిద్దిపేటలోని మంత్రి నివాసంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి బాణా సంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సంపత్‌రెడ్డి మాట్లాడుతూ… హరీష్ రావు ప్రజా నాయకుడు అని.. సంబరాలు నిండారంబరంగా చేసుకున్నామన్నారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి అని భగవంతున్ని వేడుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరామ్, గుండు శ్రీనివాస్, యువజన విభాగం అధ్యక్షుడు ఈర్షద్, శ్రీనివాస్ యాదవ్, వజీర్ తదితరులు పాల్గొన్నారు.
మొక్కలు నాటిన నేతలు..
హరీష్‌రావు పుట్టిన రోజు సందర్భంగా సిద్ధిపేటలో టిఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నేతలు మొక్కలు నాటారు. సిద్దిపేట మున్సిపాలిటీ పక్షాన హైదరాబాద్ రోడ్డులో చైర్మన్ రాజనర్సు, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి హరీష్ రావు 48వ పుట్టిన రోజు సందర్భంగా 48 మొక్కలు నాటారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కలు నాటలి.. పట్టణం పచ్చదనంగా ఉండాలి.. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నదే మంత్రి హరీష్ రావు లక్ష్యం అని, మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో, వాటిని సంరక్షణ చేయడం అంతే ముఖ్యం అని అప్పుడే మంత్రి హరీష్ రావుకు ఇచ్చే బర్త్ డే కానుక అని అన్నారు. ప్రతి రోజూ మొక్కలను సంరక్షణ ఉండేలా నీళ్లు పోయాలి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, కౌన్సిలర్ ఐలయ్య, సూడా డైరెక్టర్ కనకయ్య, శ్రీనివాస్ యాదవ్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి, బాల్ రాజు, లక్ష్మణ్, గుండు శ్రీనివాస్, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.
ఊరంతా అభిమానమే…
ప్రతి ఇంటా మొక్క నాటి తమ అభిమానం చాటుకున్న దత్తత గ్రామస్థులు…
‘సిద్దిపేట నా కుటుంబం.. మీలో ఒక కుటుంబ సభ్యున్ని. నేను ఎక్కడ ఉన్నా నా మనసు మాత్రం సిద్దిపేట ప్రజలపైనే ఉంటుంది. పక్షి ఎక్కడ ఉన్నా రాత్రికి గూడుకు చేరుకుంటుంది. నే•ను ఎక్కడ ఉన్నా రాత్రికి మాత్రం సిద్దిపేట ప్రజల గూ•కే చేరుకుంటా ఇవీ మంత్రి హరీష్ రావు నోటి నుండి వచ్చిన మాటలు. అవును నిజమే అని ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆ మాటల్ని నిజం చేశారు హరీష్ రావు దత్తత గ్రామం ఇబ్రహీంపూర్ ప్రజలు. ఆయన పుట్టిన రోజున ఊరంతా స్పూర్తిగా నిలిచారు. హరీష్ రావు అంటే మాకు అభిమానం. ఆయన మా బిడ్డ. ఆయన మా అన్న. ఆయన మాలో ఒకరు. మా ఊరిని దత్తత తీసుకున్న మా కుటుంబ సభ్యుడు హరీష్ రావు. ప్రతి ఒక్కరు తమ పుట్టిన రోజున ఒక మొక్క నాటాలి అని స్ఫూర్తి నింపిన హరీష్ రావు పుట్టిన రోజున మా ఇంట్లో మొక్క నాటి మేము స్ఫూర్తిగా నిలుస్తాం ఆయన ఆలోచనను ఆచరణలో చూపెడుతాం అని మంత్రి దత్తత గ్రామం స్ఫూర్తిని చాటుకుంది. ఇబ్రహీంపూర్ అంటే ఒక ప్రత్యేకత. అన్నింటిలో ఆదర్శంగా ఉన్న ఇబ్రహీంపూర్ తన దత్తత గ్రామం కాబట్టి మంత్రి పుట్టిన రోజున ఓ ప్రత్యేకత చాటుకోవాలి అని ఊరంతా ఇంటింటికి కుటుంబ సమేతంగా మొక్కలు నాటారు. మంత్రి పుట్టిన రోజున ప్రతి ఏటా మొక్కలు నాటుతారు. కానీ, ఈసారి గ్రామంలో 300 ఇల్లు ఉంటే 300 ఇండ్లలో ఇంటికో జామ, ఇతర పండ్ల మొక్క తమ కుటుంబ సమేతంగా నాటి స్ఫూర్తిని చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోడూరి దేవయ్య, ఉప సర్పంచ్ వంక దేవయ్య, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, కుల సంఘాల పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.