రెండు నగరాల పేర్ల మార్పునకు కేంద్రం ఆమోదం
న్యూ దిల్లీ, ఫిబ్రవరి 25 : మహారాష్ట్రలో రెండు నగరాల పేరు మార్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఔరంగాబాద్ పేరును ’ఛత్రపతి శంభాజీ నగర్’గా, ఉస్మానాబాద్ నగరానికి ’ధరాశివ్’గా పేరు మార్చేందుకు కేంద్రం అనుమతించింది. ఈ విషయాన్ని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ట్విట్టర్‌లో వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ జారీ చేసిన లేఖలను ఆయన షేర్ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీకీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
నగరాల మార్పుపై తమకెలాంటి అభ్యంతరం లేదని కేంద్రం తెలిపింది. ఈ రెండు నగరాల పేర్లు మార్చాలని పలువురు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్ ను ఎలక్షన్ హాలుగా ప్రకటించిన సీఎం ఏక్‌నాథ్ షిండే తన వాగ్దానాన్ని నెరవేర్చారు. ఉద్ధవ్ ఠాక్రే మహావికాస్ అఘాడీ ప్రభుత్వం కుప్పకూలడానికి ముందు ఈ రెండు నగరాల పేర్లను మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తాజాగా నగరాల పేర్లు మార్పు మారుస్తూ షిండే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.