మీ వోటుతో మీరే ప్రభుత్వం ఏర్పాటు చేయాలి
బిఆర్‌ఎస్‌కు గెలిపిస్తే ప్రతి ఇంటికీ తాగునీరు…ప్రతి ఎకరాకు తాగునీరు
రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు
రైతు సర్కార్‌ను తెచ్చుకుందాం రండి
ఔరంగాబాద్ వేదికగా బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ పిలుపు
శంభాజీనగర్, ఏప్రిల్ 24 : మార్పు కోసం కలసి పనిచేద్దామని..యువత నడుం బిగించి మన ప్రభుత్వాన్ని మనమే తెచ్చుకుందదామని బిఆర్‌ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు. ఈసారి రైతు ప్రభుత్వమే తెచ్చుకుందామని అన్నారు. వి• వోటు ఒక్కసారి బిఆర్‌ఎస్‌కు వేసి..వి• అదృష్టాన్ని వి•రే రాసుకోవచ్చాన్నారు. తెలంగాణ తరహా అభివృద్ది చేసి చూపుతానని అన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని..మనచేతుల్లోనే మన భవిష్యత్ ఉందని..ఓటు బలమేమిటో చూపండని పిలుపునిచ్చారు. అబ్ కీ బార్..కిసాన్ సర్కార్ నినాదంతో ఇప్పటికే మహారాష్ట్రలో ప్రకంపనలు సృష్టిస్తున్న భారత రాష్ట్ర సమితి.. మరాఠ్వాడాలో మూడో బహిరంగసభ నిర్వహించింది. బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఔరంగాబాద్ సభకు హాజరై ప్రసంగించారు. ఇప్పటికీ సాగు, తాగు నీరు అందడం లేదు. సాగు, తాగు నీరు అందకపోవడం ఎవరి పాపం? ఇప్పటికీ ప్రజలకు సాగు, తాగునీరు సరిగా అందట్లేదు.
గోదావరి, కృష్ణా, పెన్ గంగా వంటి నదులు ఉన్నా మహారాష్ట్రకు నీటి కష్టాలెందుకు..? ముంబై దేశ ఆర్థిక రాజధాని, కానీ తాగేందుకు నీళ్లుండవా..? దేశం పురోగమిస్తుందా..? తిరోగమిస్తుందా..? ఆలోచించండి. బిఆర్‌ఎస్‌ను గెలిపిస్తే మహారాష్ట్రలోనూ సాధ్యమైనంత తక్కువ కాలంలో ఇంటింటికీ ప్రతిరోజు తాగునీరు, రైతులకు ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని కెసిఆర్ హామీ ఇచ్చారు. స్వాతంత్య్రం వొచ్చి 75 ఏండ్లు అయింది. కానీ ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు. మహారాష్ట్ర పవిత్ర భూమికి నమస్కారం. అందరికీ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు. మరాఠా భూమి ఎందరో మహానుభావులకు జన్మనిచ్చింది. బీఆర్‌ఎస్‌కు ఒక లక్ష్యం ఉంది. నా మాటలను విని ఇక్కడే మర్చిపోకండి. నా మాటలపై వి• గ్రామాలకు వెళ్లి చర్చ చేయండి. వి• ఇంటివాళ్లు, స్నేహితులతో చర్చించండి.
ఈ దేశంలో ఏం జరుగు తుందో ఆలోచించండి. దేశం ఉండాల్సిన స్థితిలో ఉందా? లేదా? అనే అంశంపై చర్చ పెట్టండి. మహారాష్ట్ర వైతాళికులై ఛత్రపతి శివాజీ మహారాజ్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రీ భాయి ఫూలేతో పాటు పలువురు మహానీయులకు కేసీఆర్ పుష్పాంజలి ఘటించారు. సభా వేదికపై నుంచి మరాఠా ప్రజలకు సీఎం కేసీఆర్ అభివాదం చేశారు. ఔరంగాబాద్‌కు చెందిన నాయకులకు కూడా కేసీఆర్ అభివాదం చేశారు. కేసీఆర్ సమక్షంలో పలువురు నాయకులు.. బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్ అనే నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగిపోయింది. ఔరంగాబాద్ మాజీ ఎమ్మెల్యే అభయ్ పాటిల్ ఇంటికి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. ఆయన నివాసం వద్ద కేసీఆర్‌కు అపూర్వ స్వాగతం లభించింది. విమానాశ్రయం నుంచి నేరుగా కైలాష్ పాటిల్ ఇంటికి చేరుకున్నారు. గతంలో వైజాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు అభయ్ పాటిల్. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో ఔరంగాబాద్ బయల్దేరిన కేసీఆర్.. ఛత్రపతి శంభాజీ విమానాశ్రయానికి చేరుకున్నారు. మరికాసేపట్లో బీఆర్‌ఎస్ బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. కేసీఆర్ వెంట ఎంపీలు కేశవరావు, రంజిత్ రెడ్డి, సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్, కడియం శ్రీహరి, ఎమ్మెల్యే బాల్క సుమన్, జీవన్ రెడ్డిలు ఉన్నారు.