Take a fresh look at your lifestyle.

‘‌పిట్ట’సందేశం…!

గత ఏడాది రిపోర్టస్ ‌ప్రకారం ఫేస్‌ ‌మాస్క్ ఉత్పత్తిలో భారత్‌ ‌మిగులు ఉత్పత్తిని సాధించనున్నట్టు  నివేదికలు తెలిపాయి. గత ఏడాది జూన్‌ ‌నాటికే 1.5 బిలియన్‌ ‌త్రీ లేయర్‌ ‌మాస్క్‌ల ఉత్పత్తి సామర్థ్యాన్ని భారత్‌ ‌కలిగి ఉంది అని నివేదికలు తెలిపాయి.
తెలంగాణ మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లా చిన్నమునుగల్‌ ‌చాడ్‌ ‌కు చెందిన మేకల కుర్మయ్య పగలు రాత్రి పనిచేసే గొర్రెల కాపరి.అయినా ఓ మాస్క్ ‌కొనుక్కోలేకపోయాడు. తన పెన్షన్‌ ‌తీసుకోవటానికి ఇతను మండల కార్యాలయాన్ని సందర్శించాల్సి వచ్చింది. ఫేస్‌ ‌మాస్క్ ఉం‌టే గాని మండల కార్యాలయం లోనికి రానీయదు మేకల కుర్మయ్య మాస్క్ ‌కొనలేడు. ఫేస్‌ ‌మాస్క్ ‌లేకుండా ప్రభుత్వ కార్యాలయంలోకి ప్రవేశించటానికి అనుమతి ఉండదు అని మేకల కుర్మయ్యకు పూర్తిఅవగాహన ఉంది ఎలాగైనా పెన్షన్‌ ‌తీసుకుంటే కానీ మేకల కుర్మయ్య జీవితం గడవదు. తన పెన్షన్‌ ఎలాగైనా సొంతం చేసుకోవాలని మేకల కుర్మయ్య నిర్ణయించుకున్నాడు. విధిలేక వీవర్‌బర్డ్ ‌తన కోసం తన గుడ్లకోసం కట్టుకునే గూడును ఫేస్‌ ‌మాస్క్‌గా  ధరించి ప్రభుత్వ కార్యాలయంలోకి వెళ్లాడు.
ఈ వార్తలో ‘‘మేకల కుర్మయ్య ప్రదర్శించిన సర్వైవల్‌ ‌టెక్నిక్‌’’ ‌ను ‘‘క్రియేటివీటి’’  అంటూ పోగడటం మేలా..? లేక దేశంలో సరిపడినంత మిగులు ఉత్పత్తి మాస్క్ ‌లు  ఉండగా కొనటానికి డబ్బులేదని మేకల కుర్మయ్యకు మాస్క్ అం‌దక పోవటం ఏమిటి అని ప్రశ్నిచటం మేలా..?
– అరుణ, న్యూ దిల్లీ

Leave a Reply