Take a fresh look at your lifestyle.

‘‌ముద్రా’ మొండిబకాయిలు…!

ప్రభుత్వ రంగ బ్యాంకులకు గుదిబండ

గత మూడేళ్లలో జారీచేసిన ముద్రా రుణాలు మొండి బకాయిలుగా(ఎన్‌పిఏ) మారి ప్రభుత్వ రంగ బ్యాంకుల(పిఎస్‌బి) పై గుది బండలుగా తయారు అయ్యాయి. ముద్రా రుణాల్లోని మొండి బకాయిలుగా అయిపోయిన బ్యాంకుల్లోవున్న ప్రజల సొమ్ము 2017-18లో రూ .7,277 కోట్లకు , 2018-19లో రూ .11,483  కోట్లకు, 2019-20లో రూ .18,835 కోట్లు, పెరిగాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు అప్పులు దండిగా ఇస్తున్నాయి. అదే సమయంలో మెండుగా పెరిగిన మొండి బాకీలతో ప్రభుత్వ రంగ బ్యాంకులు సతమతమవుతున్నాయి. ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేసే బ్యాంకులు ముద్ర రుణల కింద, బ్యాంకులో ఉన్న ప్రజల సొమ్ము అప్పులుగా ఇచ్చిన వివరాలోకలకి వెళితే.. 2019-20లో రూ .3.82 లక్షల కోట్లు అప్పు ముద్ర రుణల కింద ప్రభుత్వ బ్యాంకులు మంజూరు చేసాయి.  గత ఆర్థిక సంవత్సరం 2018-19లో రూ .3.55 లక్షల కోట్లు ఉండగా, 2017-18లో రూ .2.12 లక్షల కోట్లుగా వుంది.

బ్యాంకుల్లో ఉన్న ప్రజల సొమ్ము అప్పులుగా ఇచ్చుకుంటూ పోవటం వలన 2017-18లో 3.42 శాతం ఉన్న మొండి బకాయిలు 2019-20లో 4.92 శాతానికి పెరిగాయి. ప్రధాన మంత్రి ముద్ర యోజన(పిఎమ్‌ఎం‌వై) ను ఏప్రిల్‌ 8, 2015 ‌న ప్రారంభించినప్పటి నుండి, కార్పొరేట్‌ ‌సంస్థలు కాని చిన్న రుణగ్రహీతలకు, వ్యవసాయేతర విభాగంలో ఆదాయాన్ని సృష్టించే కార్యకలాపాల కోసం బ్యాంకులు  మైక్రోఫైనాన్స్ ‌సంస్థలు ఇచ్చే అప్పులను ముద్ర రుణాలుగా పిలుస్తారు. ప్రస్తుత సంవత్సరంలో, సెప్టెంబర్‌ 11 ‌నాటికి, 59,192 కోట్ల రూపాయలను ముద్ర రుణాలుగా ప్రభుత్వ బ్యాంకులు అప్పులు ఇచ్చాయి. ముద్ర రుణాల కింద పెరుగుతున్న మొండిబకాయిల ఒత్తిడిని రిజర్వ్ ‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇం‌డియా(ఆర్‌బిఐ) ఎత్తి చూపింది, మెరుగైన రుణ మదింపు మరియు పర్యవేక్షణపై దృష్టి సారించాలను ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply