Take a fresh look at your lifestyle.

సర్వ మతాల పండుగ పంద్రాగస్టు

“ఆగస్టు 15 అనగానే ప్రతి భారతీయుని శరీరం ఉద్వేగంతో పులకిస్తుంది. దాదాపు రెండు వందల ఏళ్ల బ్రిటీష్‌ ‌పాలన నుంచి అఖండ భారతావని స్వేచ్చా •వాయువులు పీల్చిన ఆశుభదినాన్ని తల్చు కుంటే జైహింద్‌ అం‌టూ దిక్కులు పిక్కటిల్లేలా ప్రతి భారతీయుని కంఠం ధ్వనిస్తుంది. మతాలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, సంస్కృతులు వేరైనా మేమంతా భారతీయుల మన్న భావం ప్రతి వారిలో ప్రజ్వరిల్లుతుంది. విభిన్న సంస్కృతులకు, విభిన్న ఆచారాలకు నిలయమైన భారతావనిలో విదేశీయులు ప్రవేశించి భారతీయులనందరినీ బానిసలుగా చేసి రాజ్యమేలిన చీకటి రోజుల నుంచి తొలిసారి వెలుగులను చవిచూసిన ఆగస్టు 15 అంటే భారతీయులకు అతిపెద్ద శుభ దినం.”

కొరోనా అన్ని మతాల పండుగైన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నుంచి విద్యార్థులను దూరం చేసింది.చరిత్రలోనే బడిపిల్లలు ఈ సంబరాలకు దూరంగా ఉండటం ఇదే మొదటి సారి.
చరిత్ర:
భారతదేశాన్ని బ్రిటీష్‌ ‌వారు క్రమ క్రమంగా ఆక్రమించుకుంటూ 18వ శతాబ్ది చివరి వరకు దేశంలోని చాలా భాగాన్ని తమ పరిపాలన క్రిందకు, కొన్ని రాజ్యాలను తమ ప్రభావం క్రిందకు తీసుకువచ్చారు. 19వ శతాబ్ది తొలి నాటికి వారి ఆధిపత్యం పూర్తిగా స్థిరపడిపోయింది. 1858 వరకూ భారతదేశ సార్వభౌములుగా మొఘల్‌ ‌పరిపాలకులే ఉన్నా, 19వ శతాబ్ది తొలినాళ్ళ నుంచే వారి గౌరవాన్ని తగ్గిస్తూ వచ్చారు. చివరకు 1857లో ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం జరిగి భారత సిపాయిలు, రాజులు అందులో ఓడిపోయాకా 1858లో బ్రిటీష్‌ ‌రాణ •భారత సామ్రాజ్యధి నేత్రి అయ్యాకా దేశం బ్రిటీష్‌ ‌పాలన కిందకి వచ్చింది. బ్రిటీష్‌ ‌పరిపాలన నుంచి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చేందుకు జరిగిన అనేకమైన పోరాటాల్లో ఎందరో దేశభక్తులు పాల్గొన్నారు. ప్రపంచ రాజకీయాల నేపథ్యంలోనూ, ఉప్పు సత్యాగ్రహం, క్విట్‌ ఇం‌డియా ఉద్యమం, విదేశీ వస్తు బహిష్కరణ లాంటి ఉద్యమాలు, దీక్షలు, తిరుగుబాటుల ఫలితంగా దేశానికి 1947 ఆగస్టు 14న అర్థరాత్రి సమయంలో స్వాతంత్య్రం వచ్చింది.బ్రిటీష్‌ ఇం‌డియా ఆఖరు గవర్నర్‌ ‌జనరల్‌ ‌మౌంట్‌ ‌బాటన్‌ 1948‌లో నిర్ణీతమైన స్వాతంత్య్రదినాన్ని ముందుకు జరుపుతూ 1947 ఆగస్టు 15న జరగాలని నిర్ణయించారు. రెండవ ప్రపంచ యుద్ధం జపాన్ల లొంగుబాటుతో ముగిసిపోయిన రోజు ఆగస్టు 15 కావడంతో భారత స్వాతంత్య్రానికి దానిని ఎంచుకున్నారు బాటన్‌.
ఆగస్టు 15 అనగానే ప్రతి భారతీయుని శరీరం ఉద్వేగంతో పులకిస్తుంది. దాదాపు రెండు వందల ఏళ్ల బ్రిటీష్‌ ‌పాలన నుంచి అఖండ భారతావని స్వేచ్చా •వాయువులు పీల్చిన ఆశుభదినాన్ని తల్చు కుంటే జైహింద్‌ అం‌టూ దిక్కులు పిక్కటిల్లేలా ప్రతి భారతీయుని కంఠం ధ్వనిస్తుంది. మతాలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, సంస్కృతులు వేరైనా మేమంతా భారతీయుల మన్న భావం ప్రతి వారిలో ప్రజ్వరిల్లుతుంది. విభిన్న సంస్కృతులకు, విభిన్న ఆచారాలకు నిలయమైన భారతావనిలో విదేశీయులు ప్రవేశించి భారతీయులనందరినీ బానిసలుగా చేసి రాజ్యమేలిన చీకటి రోజుల నుంచి తొలిసారి వెలుగులను చవిచూసిన ఆగస్టు 15 అంటే భారతీయులకు అతిపెద్ద శుభ దినం. తరాలు మారినా మనుషులు మారినా  ప్రతి ఒక్కరు భరతమాతను ఒక్కసారైనా మదిలో తల్చుకుంటారు.

అదే సమయంలో భారత దాస్య శృంఖలాలకు తెంచేందుకు ప్రాణాలను తృణ ప్రాయంగా భావించిన అమరవీరులను సైతం ప్రతిఒక్కరు స్మరించుకుంటారు. స్వాతంత్రం కోసం పోరాడటం, స్వాతంత్య్రం సంపాదించడం అన్న అంశం ప్రతిదేశ చరిత్రలోనూ ప్రస్ఫుటంగా గోచరిస్తుంది. అయితే ఆదేశాల స్వాతంత్య్ర సంగ్రామానికి, స్వాతంత్య్ర సంగ్రామానికి చాలా తేడా ఉంది. ఆయా దేశాల స్వాతంత్య్ర సంగ్రామానికి ఎవరో కొందరు మాత్రమే ప్రాతినిథ్యం వహించి వారి దేశానికి స్వాతంత్రం సంపాదించడం జరిగింది.
కానీ,భారత స్వాతంత్య్ర సంగ్రామం పెద్ద చరిత్ర లాంటిది. ప• •దేశీయులు తమపై సాగిస్తున్న అజమాయిషీని భరించలేని భారతీయులు ఒక్కొక్కరు ఏకమై మహాప్రళయంగా మారి క్విట్‌ ఇం‌డియా అంటూ బ్రిటీష్‌ ‌వారిని దేశం నుంచి తరిమివేసిన వైనం ప్రపంచదేశాలకు ఆదర్శప్రాయంగా మారింది. భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చినప్పుడు, ఆ సంబరాలకు దూరంగా గాంధీ ఏం చేస్తున్నారు? భారతస్వాతంత్రోద్యమానికి మహాత్మాగాంధీ నేతృత్వం వహించారు. కానీ, దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చినపుడు ఆ సంబరాలలో  ఆయన పాల్గొనలేదు.

స్వతంత్ర భారతదేశానికి సంబంధించిన కొన్ని ఆసక్తి కరమైన విషయాలు

 1. మహాత్మా గాంధీ స్వాతంత్రం లభించినరోజున దిల్లీకి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంగాల్లోని నోవాఖలీలో ఉన్నారు. అక్కడ ఆయన హిందూ, ముస్లింల మధ్య మత ఘర్షణలను అడ్డుకోడానికి నిరాహార దీక్ష చేస్తున్నారు.
 2. ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వస్తుందనే విషయం పక్కాగా తెలియగానే జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూ, సర్దార్‌ ‌వల్లబాభా•యిపటేల్‌, ‌మహాత్మా గాంధీకి లేఖ రాశారు. అందులో ఆగస్టు 15 మన మొదటి స్వతంత్ర దినోత్సవం అవుతుంది. మీరు జాతి పిత. ఇందులో పాల్గొని మీ ఆశీస్సులు అందించండి అని కోరారు.
 3. గాంధీ ఆ లేఖకు సమాధానం ఇచ్చారు. అందులో కలకత్తాలోని హిందూ-ముస్లింలు ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకుంటున్నప్పుడు నేను సంబరాలు జరుపుకోడానికి ఎలారాగలను. ఈఘర్షణలు ఆపడానికి నేను నాప్రాణాలైనా ఇస్తా అన్నారు.
 4. జవహర్‌లాల్‌ ‌నెహ్రూ తన చారిత్రక ప్రసంగం ‘ట్రిస్ట్ ‌విత్‌ ‌డెస్టిని’ ఆగస్టు 14న అర్థరాత్రి వైస్రాయాలాంజ్‌ (‌ప్రస్తుత రాష్ట్రపతిభవన్‌) ‌నుంచి ఇచ్చారు. నెహ్రూ అప్పటి• •ప్రధాన మంత్రి కాలేదు. ఆయనప్రసంగాన్ని ప్రపంచమంతా విన్నది. కానీ, గాంధీ ఆ రోజు 9 గంటలకే నిద్రపోయారు.
 5. లార్డ్ ‌మౌంట్‌ ‌బాటన్‌ 1947 ఆగస్టు 15న తన ఆఫీసులో పని చేశారు. మధ్యాహ్నం నెహ్రూ ఆయనకు తన మంత్రి మండలి సభ్యుల జాబితాను అందించారు. తర్వాతఇండియా గేట్‌ ‌దగ్గర ప్రిన్సె స్‌ ‌గార్డెన్‌లో ఒక బహిరంగసభలో మాట్లాడారు.
 6. ప్రతి స్వాతంత్య్రదినోత్సవం రోజున భారత ప్రధాన మంత్రి ఎర్రకోటపై జెండా ఎగరేస్తారు. కానీ, 1947 ఆగస్టు 15న మాత్రం అలా జరుగలేదు. లోక్‌సభ సెక్రటేరియట్లోని పత్రాల ప్రకారం 1947 ఆగస్టు 16న నెహ్రూ ఎర్రకోటపై భారతజెండాను ఎగురవేశారు.
 7. భారత అప్ప• •వైస్రయి లార్డ్ ‌మౌంట బాటన్‌ ‌స్సెక్రటరీ కాంప్బెల్జాన్సన్‌ ‌వివరాల ప్రకారం మిత్ర దేశాల సేనల ముందు జపాన్లు లొంగిపోయి, 1947 ఆగస్టుకు రెండేళ్లైన సందర్భంగా భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వాలని నిర్ణయించారు.
 8. ఆగస్టు 15 వరకూ భారత్‌, ‌పాకిస్తాన్‌ ‌మధ్య సరిహద్దు•రేఖను నిర్ణయించ లేదు. దానిని ఆగస్టు 17న రాడ్‌ ‌క్ల్లిఫెన్‌గా ప్రకటించారు.
 9. ఆగస్టు 15న భారతదేశానికి విముక్తి లభించింది. కానీ దేశానికి అప్పటి వరకూ జాతీయగీతం ఏదీ లేదు. జనగణమణ గీతాన్నిరవీంద్రనాథ్‌ ‌ఠాగూర్‌ 1911‌లోనే రా• •ఉంచారు. అయితే, అది 1950లో జాతీయగీతం గౌరవాన్ని పొందింది.
  ఆగస్టు 15న భారత్‌తో పాటు మరో మూడు దేశాలు కూడా స్వతంత్రదినోత్సవాన్ని జరుపుకుంటాయి. దక్షిణ కొరియా జపాన్‌ ‌నుంచి 1945 ఆగస్టు 15న స్వాతంత్రం పొందింది. బహరీన్‌కు 1971 ఆగస్టు 15న బ్రిటన్‌ ‌నుంచి విముకి్త  లభించింది. కాంగో 1960 ఆగస్టు 15నఫ్రాన్స్ ‌నుంచి స్వాతంత్రంపొందింది.
dr md quazaidin
డాక్టర్ ఎం డి ఖ్వాజా మొయినొద్దీన్
ప్రొఫెసర్, అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్యంగ్ సైంటిస్ట్ ఆవార్డ్ గ్రహిత.
9492791387

Leave a Reply