Take a fresh look at your lifestyle.

మరికొద్ది వారాల పాటు పొడిగించాలి?

  • లాక్‌డౌన్‌, ‌రాష్ట్రంలో కొరోనా కట్టడిపై…
  • ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ ‌సమీక్ష
  • హాజరైన మంత్రి ఈటల, సీఎస్‌ ‌సోమేశ్‌, ‌డీజీపీ మహేందర్‌రెడ్డి

రాష్ట్రంలో కొరోనా వైరస్‌ ‌నియంత్రణకు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితిపై సీఎం కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్‌లో నిర్వహించిన ఈ సమావేశానికి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌, ‌ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌, ‌డీజీపీ మహేందర్‌ ‌రెడ్డితో పాటు వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. శనివారం ఉదయం 11 30 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ‌నిర్వహించనున్నారు. దీంతో పాటు మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్‌లో రాష్ట్ర కేబినెట్‌ ‌ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే లాక్‌డౌన్‌ ‌గడువు మంగళవారంతో ముగుస్తున్నందున దీనికి మరికొద్ది వారాల పాటు పొడిగించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేయాలని సీఎం కేసీఆర్‌ ‌భావిస్తున్నారు.

- Advertisement -

శనివారం ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొననున్న సీఎం కేసీఆర్‌ ఆయనకు ఇదే విషయాన్ని స్పష్టం చేయనున్నారు. అలాగే, మంత్రివర్గ సమావేశంలోనూ లాక్‌డౌన్‌ ‌పొడిగింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయి ? వలస కూలీల పరిస్థితి ఏంటి ? తెల్లకార్డుదారులకు ఉచిత బియ్యం పంపిణీ, ప్రతీ కుటుంబానికి రూ. 1500 నగదు బదిలీ వంటి అంశాలపై సీఎం కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో విపులంగా చర్చించారు. అలాగే, రాస్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ఏ విధంగా జచుగుతోంది ? ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం కోరాలి ? వైద్యులకు రక్షణ కిట్లు సరఫరా చేసే అంశంపై సీఎం కేసీఆర్‌ ఈ ‌సమీక్షా సమావేశంలో చర్చించారు.

Leave a Reply