Take a fresh look at your lifestyle.

ఇష్టంతో ‘పది’ పరీక్షలకు హాజరుకండి: కలెక్టర్‌

పదోతరగతి వార్షిక పరీక్షలు దగ్గరపడ్డాయని అ పరీక్షలకు హజరయ్యే విధ్యార్థులు భయాన్ని వీడాలని ఇష్టంతో చదువుకొని పరీక్షలలో మంచి మార్కులు సాధించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్‌ ‌రవి అన్నారు. బుధవారం బీర్‌పూర్‌ ‌మండలంలోని పల్లెప్రగతి పనులను అకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్బంగా అయా గ్రామ పంచాయితీ సర్పంచులకు పలు సూచనలు చేశారు. అనంతరం అక్కడి జిల్లా పరిషత్‌ ‌ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పేర్వేల్‌ ‌పార్టీలో కలెక్టర్‌ ‌పాల్గోని ప్రసంగించారు. ఈనెల 19 నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయని విధ్యార్థులు ఎలాంటి అందోళనలను పెట్టుకోకుండా ధైర్యంతో పరీక్షలను రాయాలని కలెక్టర్‌ ‌సూచించారు. ఉపాద్యాయులు విధ్యార్థులను ఆదిశగా ప్రిపేర్‌ ‌చేయించాలని అన్నారు. విధ్యార్థులకు ఇంటివద్ద చదువుకునే సౌకర్యంలేని విధ్యార్థులను గుర్తించి పాఠశాలలోనే విధ్యుత్‌ ‌సౌకర్యం కల్పించి చదివించే ఏర్పాట్లు చేయాలన్నారు.

చదువులో ప్రతిభను ప్రధర్శిస్తే ఉద్యోగరిత్యా, వ్యాపారరిత్యా జీవనం సాగించవచ్చన్నారు. పాఠశాల పరిదిలోని ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్లాస్టిక్‌ను వాడకుండా ప్రజా ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ‌చెప్పారు. ఆనంతరం గ్రామంలో నాలుగు ఎకరాలలో పద్దెనిమిది వందల మొక్కలతో ఏర్పాటు చేసిన మంకిఫుడ్‌ ‌కోర్టును కలెక్టర్‌ ‌పరిశీలించారు. అక్కడే పనిచేస్తున్న కార్మికులు గుర్తింపు కార్డులను పరిశీలించారు. ఆగ్రామములో పన్నుల వసూలు తీరును అక్కడి కార్యదర్శిని అడిగి తెలుసుకోగా 82 శాతం వసూలైనట్లు కార్యదర్శి తెలిపారు. వైకుంఠదామం, డంపింగ్‌యార్డును పరిశీలించి త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ‌సూచించారు. అనంతరం రోళ్ళవాగు ప్రాజేక్టును పరిశీలించిన కలెక్టర్‌ ‌సంబందిత ఇంజనీర్లతో పనుల తీరును అడిగి తెలుసుకోన్నారు. 60 కోట్ల 50 లక్షల 25 వేల నిధులతో చేపడుతున్న ఈప్రాజేక్టును త్వరగా పూర్తి చేయాలని అవసరమైతే మిషన్లు, వర్కర్లను పెంచుకోవాలని అక్కడి సిబ్బందికి కలెక్టర• సూచించారు. ఈప్రాజేక్టు పూర్తయితే సారంగాపూర్‌లో 189 ఎకరాలకు, బీర్‌పూర్‌లో యాబై మూడు ఎకరాల అయకట్టుకు నీరందుతుందని సత్వరమే పనులను పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ‌సూచించారు. కలెక్టర్‌ ‌వెంట డిఆర్‌డిఏ పిడి )క్ష్మినారాయణ, ఇంజనీర్‌ ‌సక్రునాయక్‌, ‌తహశీల్దార్‌ శ్రీ‌నివాస్‌, ఎం‌పిడివో మల్లారెడ్డి, సర్పంచ్‌, ‌జడ్పిటిసితోపాటు పలువురు ఉన్నారు.

Leave a Reply

error: Content is protected !!