మంత్రి కేటీఆర్‌పై ప్రేమతో కాదని, బీజేపీ ఒత్తిడికి తలొగ్గే కేసీఆర్ సీఎం పదవిని వదులుకోవడానికి సిద్ధమయ్యారని కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య తప్పుబట్టారు. దిగిపోయాక కూడా కేసులతో బీజేపీ వేధిస్తే.. సానుభూతి పొందాలనేది కేసీఆర్ ఆలోచనగా ఉందన్నారు. భూముల అన్యాక్రాంతంపై సీఎం మౌనం వీడాలని పొన్నాల డిమాండ్ చేశారు. విషయాలు దాచి పెట్టి కబ్జాకోరులను కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. తప్పుచేస్తున్నాడు కాబట్టే కేసీఆర్ వి•డియాతో మాట్లడటం లేదని, పూజల పేరుతో దేవుళ్లను ఆయన మోసం చేస్తున్నారని పొన్నాల లక్ష్మయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ బంధువులు భూములు కబ్జా చేస్తే చర్యలు ఉండవా..? అని లక్ష్మయ్య ప్రశ్నించారు. అయోధ్య రామ మందిరానికి విరాళమిచ్చిన ఆయన రాముడు అందరి వాడు.. రాముడికి రాజకీయాలను ఆపాదించటం సరైంది కాదని అన్నారు. రామ మందిర నిర్మాణానికి ఒక లక్షా నూట పదహారు రూపాయల విరాళం ప్రకటించారు ఆయన.
నా పెన్షన్ నుంచి రాముడి ఆలయానికి విరాళం ఇస్తున్నామన్నాఆయన భారత రాష్ట్రపతి ద్వారా నా విరాళం పంపిస్తున్నానని అన్నారు.ఇక సంస్కరణలు తెచ్చింది కాంగ్రెస్ అని పేర్కొన్న అయన కేసీఆర్ సీఎం పదవి నుండి తప్పుకుని కొడుక్కి పట్టం కట్టబెట్టే పనిలో ఉన్నారని ప్రచారం జరుగుతోందని అన్నారు. కేసీఆర్ అవినీతి బయట పడుతుంది అని ఢిల్లీకి భయపడుతున్నారన్న పొన్నాల బీజేపీ ఒత్తిళ్లకు సీఎం పదవి నుండి దిగిపోతున్నారని అన్నారు. పదవి నుండి దిగిపోయాక కేసులు వేస్తే సానుభూతితో ఓట్లు పొందే కుట్ర కూడా కేసీఆర్ చేస్తున్నాడని అన్నారు. దేవుడి పేరుతో ప్రాజెక్టులు కడితే అవినీతి అడగరు అని అనుకుంటున్నారని అసలు డీపీఆర్ లు ఇవ్వకుండా ప్రాజెక్టులు కట్టేశారని ఆయన అన్నారు. అవినీతి బయట పడుతుందని డీపీఆర్ ఇవ్వడం లేదని అన్నారు. జగన్ నీళ్ల దోపిడీ బయట పడుతుందని డీపీఆర్ లు ఇవ్వడం లేదని అన్నారు.
ఇప్పటికైనా ఎల్ఆర్ఎస్ ఉపసంహరించుకోవాలి: కోమటిరెడ్డి
ఎల్ఆర్ఎస్పై సర్కార్‌కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలిందని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం ఆయన వి•డియాతో మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్పై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించిందని తెలిపారు. ఇకనైనా సీఎం కేసీఆర్ బుద్ధి తెచ్చుకుని ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని కోమటి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైన విషయం తెలిసిందే. బీఆర్ఎస్లపై స్టే యధావిధిగా కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. ఇదే అంశం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని, సుప్రీంకోర్టు ఉత్తర్వుల తర్వాతే విచారణ చేపడతామని హైకోర్టు పేర్కొంది. అప్పటి వరకు అర్జీదారులను ఇబ్బందులకు గురిచేయొద్దని న్యాయస్థానం సూచించింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆర్డర్ కాపీలను ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశించింది. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్లపై ఇప్పటికే 3 రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఇంప్లీడ్ చేసిందని, సుప్రీంకోర్టు తుది ఆదేశాల తర్వాత పిటిషన్‌ను విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఎల్ఆర్ఎస్ అంశంలో ప్రభుత్వం తెచ్చిన జీవోపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని హైకోర్టుకు ఏజీ తెలిపారు.