Take a fresh look at your lifestyle.

‌డ్రగ్స్ ‌కేసును అటకెక్కించే ప్రయత్నాలు

  • ఇడి విచారణకు సహకరించని ప్రభుత్వం
  • కేసును మాయ చేస్తున్న ప్రభుత్వ పెద్దలు
  • హైదరాబాద్‌ ‌మరో పంజాబ్‌ అవుతందన్న ఆందోళన
  • అకున్‌ ‌సభర్వాల్‌ను అర్థాంతరంగా ఎందుకు బదిలీ చేశారు
  • ఇడి అధికారులను కలసిన పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌‌రెడ్డి

ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 11 : డ్రగ్స్ ‌కేసును అటకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విచారణపై పీసీసీ చీప్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీని వెనుక రాష్ట్ర  ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. డ్రగ్స్ ‌కేసు విషయంలో ప్రభుత్వ వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రంలో గుట్కా, మట్కా, గుడుంబా, పేకాట లేదని కేసీఆర్‌ ‌చెబుతున్నారని అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయని అన్నారు. డ్రగ్స్ ‌మహమ్మారి విద్యా సంస్థల్లో విజృంభిస్తుందని, కాలేజీల్లోనే కాదు.. స్కూల్స్‌లోనూ విచ్చలవిడిగా దొరుకుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. డ్రగ్స్ ‌గురించి మాట్లాడితే హైదరాబాద్‌ ‌బ్రాండ్‌ ఇమేజ్‌ ‌దెబ్బతింటుందని కేటీఆర్‌, ‌బాల్క సుమన్‌ ‌లాంటి వాళ్లు ప్రగల్భాలు పలుకుతున్నారని రేవంత్‌ ‌రెడ్డి మండిపడ్డారు. 2017 నాటి డ్రగ్స్ ‌కేసు విచారణ ఎందుకు అటకెక్కిందని, అకున్‌ ‌సభర్వాల్‌ను అర్థాంతరంగా ఎందుకు బదిలీ చేశారని ఆయన ప్రశ్నించారు.

డ్రగ్స్ ‌వ్యవహారంపై అన్ని విచారణ సంస్థలకు ఫిర్యాదు చేసినా..హైకోర్టుకు వెళ్లినా ఫలితం లేకుండాపోయిందని రేవంత్‌ ‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన డ్రగ్స్, ‌గంజాయి ఇతర విషయాల గురించి వివరాలను తెలుసుకునేందుకు ఈడీ అధికారులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈడీ విచారణకు సిద్ధంగా ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం విచారణను వ్యతిరేకిస్తుందని మండి పడ్డారు. ఎక్సైజ్‌ ‌శాఖ వద్ద అన్ని ఆధారాలున్నా ఈడీకి ఇచ్చేందుకు నిరాకరిస్తుందని..దీనిపై కేంద్రం వెంటనే స్పందించి స్వతంత్ర విచారణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని రేవంత్‌ ‌రెడ్డి డిమాండ్‌ ‌చేశారు. 12నెలల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రాబోతుందన్న ఆయన.. అధికారంలోకి వొచ్చాక డ్రగ్స్ ‌దొంగల అంతుచూస్తామని హెచ్చరించారు.

తెలంగాణలో విచ్చలవిడిగా డ్రగ్స్ ‌సరఫరా జరుగుతుందని రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. తెలంగాణ గుట్కా లేదు, మట్కా లేదు అని కేసీఆర్‌ ‌చెప్పారని, గల్లీ గల్లీలో గంజాయి గుప్పు మంటుందని నేను అప్రమత్తం చేశానన్నారు. ఈ గుట్కా, మట్కా, డ్రగ్స్‌పై నిఘా లేకపోతే మరో పంజాబ్‌ అవుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించానని, చిన్నారి పై జరిగిన లైంగిక దాడి, గంజాయి మత్తులో జరిగిందని ఒక వైపు ప్రభుత్వం చెపుతుందన్నారు. గుడుంబాను నిషేధించామని చెప్పారని, పాఠశాల నుండి కళాశాల వరకు గంజాయి విస్తరించిందని ఆయన మండిపడ్డారు. జూబ్లీహిల్స్, ‌బంజారా హిల్స్‌లో మాత్రమే ఉండే ఈ పబ్‌ ‌లు, ఇప్పుడు తాజాగా 90 పబ్‌ ‌లకు అనుమతి ఇచ్చారని, 2017లో డ్రగ్స్ ‌కేసులో 12 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి హడావుడి చేశారన్నారు. అప్పట్లో ఇన్వెస్ట్ ‌గేషన్‌ ‌చేసిన అధికారి ఎక్కడ ఉన్నాడో కూడా ఇప్పుడు తెలియదని, ఆ కేసును రాష్ట్ర ప్రభుత్వం తొక్కి పెట్టిందని ఆయన ఆరోపించారు.రాష్టాన్న్రి యువతను  డ్రగ్స్ ‌మహమ్మారి  పట్టిపీడిస్తోందన్నారు.. పీసీసీ చీఫ్‌  ‌రేవంత్‌ ‌రెడ్డి. హైదరాబాద్‌ ‌కేంద్రంగా చేసుకుని  డ్రగ్స్ ‌మాఫియా  రెచ్చిపోతోందన్నారు. ప్రభుత్వ పెద్దలు  డ్రగ్స్ ‌కేసును  బలహీన పరిచారని ఆరోపించారు.  ఈడీ కార్యాలయానికి   వెళ్లిన రేవంత్‌ ‌రెడ్డి.. డ్రగ్స్ ‌కేసు పారదర్శకంగా  విచారణ చేపట్టాలని అధికారులను కోరారు. డ్రగ్స్ ‌కేసులో గతంలో ఎక్సైజ్‌ ‌శాఖ  సరైన విచారణ  చేపట్టలేదన్నారు. కేసుకు సర్కార్‌ ‌సహకరించడం  లేదని ఇడి  చెబుతోందని  చెప్పారు.  నిందితుల దగ్గర సేకరించిన ఫోన్‌, ‌ల్యాప్‌ ‌టాప్స్ ‌సమాచారం ఇడికి  ఇవ్వాలన్నారు. అప్పుడే  కేసులో ఎవరెవరు ఉన్నారో తెలుస్తుందన్నారు.

 

Leave a Reply