Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్ కిసాన్ సెల్ ఆద్వర్యంలో ప్రగతి భవన్ ముట్టడికి యత్నం..

నిరసన వ్యక్తం చేసేందుకు అవకాశం ఇవ్వడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు.అసెంబ్లీ లో ప్రజా సమస్యల పై చర్చ జరగలేదని విమర్శించారు. రైతుల డిమాండ్ల పై ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కాంగ్రెస్ కిసాన్ సెల్ ఆద్వర్యంలో ప్రగతి భవన్ ముట్టడికి యత్నంచారు.ఈ కార్యక్రమంలో  ములుగు ఎమ్మెల్యే సితక్క  కిసాన్ కాంగ్రెస్ నేతలు అన్వేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు, భారీ వర్షాలకు నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రగతి భవన్ ముట్టడి కి ప్రయత్నించారు.పోలీసులకు సితక్క కి మధ్య తోపులాట జరిగింది .ఐతే ముట్టడికి యత్నించిన వారిని పోలీసులు అడ్డుకొని పోలీస్ స్టేషన్ కి తరలించారు. పంటల బీమా కింద రైతులకు చెల్లించాల్సిన పరిహారం 500 కోట్లు చెల్లింపు, ఏకకాలంలో రుణమాఫీ చేయాలని కిసాన్ సెల్ డిమాండ్ చేసింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply