Take a fresh look at your lifestyle.

ధరణితో భూములను లాక్కునే ప్రయత్నం

  • నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి
  • రాష్ట్రంలో ఆరోగ్య సంక్షోభం నెలకొంది
  • కెసిఆర్‌ ‌పాలనపై మండిపడ్డ కోదండరామ్‌
  • ‌పన్నుల పేరుతో ప్రజల నడ్డి విరుస్తున్న కేసీఆర్‌, ‌మోదీ
  • పెట్రోల్‌, ‌డీజిల్‌లపై రూ.24 లక్షల కోట్లు వసూలు
  • తెలంగాణకు పట్టిన గులాబీచీడను పారదోలాలి
  • పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి
  • భారత దేశాన్ని కాపాడుకోవడానికే పోరు
  • దేశాన్ని తాకట్టు పెడుతున్న ప్రధాని మోడీ
  • సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి
  • విపక్షాల ఐక్యతతో పోరాడుతామన్న కాంగ్రెస్‌ ‌నేత మాధుయాష్కీ
  • రై•తులు కొరోనాను జయించి పోరాడారన్న రావుల
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఇందిరాపార్క్ ‌వద్ద అఖిలపక్ష మహాధర్నా
  • పాల్గొన్న ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు

రాష్ట్రంలో ఆరోగ్య సంక్షోభం నెలకొందని తెలంగాణ జనసమితి  అధ్యక్షుడు కోదండరామ్‌ ఆరోపించారు. కోవిడ్‌ ‌కారణంగా ఎంతో మంది జీవితాలు ఛిన్నాభిన్నమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా అఖిలపక్షం ఇందిరా పార్క్ ‌వద్ద మహాధర్నా నిర్వహంచియి. ప్రజా సంఘాలు కూడా ధర్నాకు మద్దతు ప్రకటించాయి. మూడు వ్యవసాయ బిల్లులు, పెట్రోల్‌, ‌డీజిల్‌.. ‌నిత్యావసరాల ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ, ఉపాధి హావి• పని దినాలు, కూలి ధరల పెంపు తదితర డిమాండ్లపై జాతీయ స్థాయిలో విపక్ష పార్టీలు తీసుకున్న నిర్ణయం మేరకు బుధవారం హైదరాబాద్‌ ఇం‌దిరాపార్క్ ‌ధర్నాచౌక్‌ ‌వద్ద బీజేపీ, టీఆర్‌ఎస్‌ ‌యేతర పార్టీల మహాధర్నాకు దిగాయి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టిన అఖిలపక్ష ధర్నాలో కోదండరామ్‌ ‌మాట్లాడుతూ..ఇసుక, భూ దందాలు చేస్తున్నవారి కోసమే టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం పని చేస్తుందని కోదండరామ్‌ ‌విమర్శించారు. కేసీఆర్‌ ఒక్కడే ప్రగతి భవన్‌లో ఉంటే… ప్రతిపక్షాలన్నీ ఇందిరా పార్క్ ‌వద్ద ఉన్నాయన్నారు. కోవిడ్‌ ‌కారణంగా రాష్ట్రంలో ఎంతో మంది జీవితాలు చిన్నాభిన్నమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. డిమాండ్ల సాధన మొదలు పెడుతుంటే..కేసీఆర్‌ ‌నల్ల చట్టాలను తెర వి•దకు తెస్తున్నారని మండిపడ్డారు. ధరణి చట్టం సంపన్నులకు లాభం చేకూర్చేలా ఉందని తెలిపారు. ధరణిలో అప్లికేషన్లు తీసుకొనే వారు కూడా ఎవరో తెలియదని చెప్పారు. పోడు భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు.

ఇప్పటి వరకు భూములు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయం చూపించలేదని తెలిపారు. మరోవైపు ఉద్యోగాలు లేక నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీలకతీతంగా అంతా కలిసి న్యాయ పోరాటం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

పన్నుల పేరుతో ప్రజల నడ్డి విరుస్తున్న కేసీఆర్‌, ‌మోదీ : పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి
గల్లీలోని కేడీ.. ఢిల్లీలో ఉన్న మోడీ ఇద్దరూ ఒకటే అని పీసీసీ అధ్యక్షడు రేవంత్‌ ‌రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ పన్నుల రూపంలో సీఎం కేసీఆర్‌, ‌ప్రధాని మోదీ.. ప్రజల నడ్డి విరుస్తున్నారని ధ్వజమెత్తారు. హరితహారం పేరుతో టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం పోడు భూములను గుంజుకుంటుందని రేవంత్‌ ‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ విముక్తి కోసం ఆఖరి పోరాటం చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో పోడు భూముల కోసం కొట్లాట మొదలయ్యిందన్నారు. మహిళలు అని కూడా చూడకుండా డెకాయిట్‌ ‌కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. భూములతో పాటు తమ ప్రాణాలు కూడా తీసుకోండని గిరిజనులు వాపోతున్నారని గుర్తుచేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ..నలుగురి చేతుల్లో బందీ అయిందన్నారు.

తెలంగాణ విముక్తి జరగాలంటే గులాబి చీడ వదిలించుకోవాలని తెలిపారు. పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు..రూ.24 లక్షల కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. నల్లధనం బయటకు తెస్తానని చెప్పిన మోదీ..ప్రతి పేద కుటుంబానికీ రూ.15 లక్షలు బాకీపడ్డారన్నారు. ప్రధాని మోదీ చాయ్‌ అమ్మిన రైల్వే స్టేషన్‌..‌కాంగ్రెస్‌ ‌పార్టీ కట్టిందేనని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ ‌పార్టీ రైల్వే స్టేషన్‌లు కడితే..మోదీ ప్రభుత్వం రైళ్లు అమ్ముతుందని విమర్శించారు. ప్రభుత్వ సంస్థలను రూ.6 లక్షల కోట్లకు అమ్ముతున్నారని చెప్పారు. మేము ఇద్దరం.. మాకు ఇద్దరు అనే రీతిలో దేశాన్ని పట్టి పీడిస్తున్నారని దుయ్యబట్టారు. అన్ని పార్టీలను ఒకే గొడుగు కిందకు తెస్తున్నట్లు చెప్పారు. తాము ఎలాంటి రాజకీయాల కోసం కాకుండా.. దేశం, రాష్ట్ర సంక్షేమం కోసమే పోరాటం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 27వ తేదీన తలపెట్టిన భారత్‌ ‌బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

మరోవైపు 30న అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని అంబేడ్కర్‌ ‌సాక్షిగా కలెక్టర్లకు వినతులు ఇవ్వనున్నట్లు చెప్పారు. పోడు భూములకు పట్టాలు ఎలా ఇవ్వరో చూద్దామంటూ రేవంత్‌ ‌రెడ్డి మండిపడ్డారు. రైతులు కొరోనాని కూడా ఎదురించారని, రైతన్నను సంప్రదించకుండా వ్యవసాయ చట్టాలు తెచ్చారని టీటీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌ ‌రెడ్డి విమర్శించారు. మహాధర్నాలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కార్పొరేట్‌ ‌వ్యవసాయం రాజ్యమేలుతోందని, రైతన్న కనుమరుగు అయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. 2006లో వొచ్చిన చట్టం ప్రకారం పోడు భూముల్లో సాగు చేస్తున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు. రాష్ట్రం, కేంద్రం రెండు కూడా ప్రైవేట్‌ ‌పరంవైపు చూస్తున్నాయని విమర్శించారు. ప్రజల పక్షాన పోరాడే కార్యక్రమాలకు టీడీపీ మద్దతు ఇస్తుందని రావుల స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ‌మాజీ ఎంపి మదుయాష్కీ మాట్లాడుతూ ఇది చారిత్రాత్మక దినమని…దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు ఒకే వేదిక వి•దకు వొచ్చాయని అన్నారు.

భారత రాజకీయాలకు ఇది ఒక మలుపన్నారు. కేంద్రంలో మోదీ సర్కార్‌ ‌ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని విమర్శించారు. మోదీ నియోజక వర్గం వారణాసి గంగానదిలో 100లాది కొరోనా శవాలు కొట్టుకు వొచ్చాయని…ఇది మోదీ సర్కార్‌ ‌వైఫల్యాలకు నిదర్శనమన్నారు. కొరోనాతో దేశం అల్లకల్లోలం అయితే మోదీకి మాత్రం విదేశీ పర్యటనలు అని మండిపడ్డారు. జాతీయ స్థాయిలో నవగ్రహాలు అయిన ప్రభుత్వ కంపెనీలను అమ్మకం పెట్టడం దారుణమన్నారు. అంబానీ, అదానీలకు ప్రభుత్వ కంపెనీలు కట్టబెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి టీఆర్‌ఎస్‌ ‌బీ టీమ్‌ అని వ్యాఖ్యానించారు. బీజేపీకి, కేసీఆర్‌కి హెచ్చరికలు చేస్తున్నాం…అన్ని పార్టీల కలయికతో వి• కోటలు బద్దలు కొడతామని అన్నారు. కమ్యూనిస్ట్‌లతో దూరం పెరగడం తమకు జరిగిన నష్టమని తెలిపారు. వరి వేస్తే ఉరి అని చెప్పే కేసీఆర్‌ ‌లక్ష కోట్లు పెట్టీ ప్రాజెక్ట్‌లు ఎందుకు కట్టారని ప్రశ్నించారు. తెలంగాణలో 19 పార్టీల పునరేకీకరణ జరిగిందని మధుయాష్కి తెలిపారు.

దేశాన్ని తాకట్టు పెడుతున్న ప్రధాని మోడీ : సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి
భారతదేశాన్ని కాపాడుకోవడం కోసం నేటి నుంచి మన ప్రజా ఉద్యమం ప్రారంభమవుతుందని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. మహాధరాల్రో పాల్గొన్న సీతారాం ఏచూరి మాట్లాడుతూ మోదీని గద్దె దించే వరకు పోరాటం చేస్తామన్నారు. రాజ్యాంగాన్ని కాపాడే నాలుగు స్తంభాలను మోదీ ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రంలో ప్రశ్నించే వారిని నయానో భయానో లొంగ దీసుకుంటున్నారని విమర్శించారు. గోడౌన్స్‌లో ధాన్యం మూలుగుతున్నాయని, కొరోనాతో నష్ట పోయిన కుటుంబాలకు రూ. 7,500 ఆర్థిక పరిహారం అందించాలని డిమాండ్‌ ‌చేశారు.

మోదీ విదేశీ పర్యటనల వెనుక హిడెన్‌ అజెండా ఉందని, అక్కడకు వెళ్లి ఏమి అమ్మెస్తారోనని భయంగా ఉందన్నారు. ఇవాళ ప్రతిపక్ష పార్టీలు కలిసింది అవకాశవాదం కోసం కాదని, భారత దేశాన్ని కాపాడుకోవాలనే సంకల్పంతోనని సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. మహాధర్నాలో టీటీడీపీ అధ్యక్షులు బక్కని నర్సింహులు, మాజీ మంత్రి రావుల చంద్రశేఖర్‌ ‌రెడ్డి, మాజీ ఎంపీ అజీజ్‌ ‌పాషా, మాజీ ఎంపీ రాజయ్య, టీజేఎస్‌, ‌సీపీఎం, సీపీఐ, టీడీపీ, సీపీఐ ఎంఎల్‌ ‌లిబరేషన్‌, ఎంఎల్‌  ‌న్యూ డేమోక్రసి, ప్రజా సంఘాలు పాల్గొన్నాయి.

Leave a Reply