వాసాలమర్రి వెళ్లడం వెనక ఫామ్‌హౌజ్ స్వార్థం ఉందన్న కాంగ్రెస్ నేత పొన్నాల
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై సీఎం కేసీఆర్‌వి అన్నీ డ్రామాలేనని కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. అక్కడ జగన్, ఇక్కడ కేసీఆర్ నీటి సెంటిమెంట్‌తో లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వీరి రాజకీయ డ్రామాలు ఎక్కువ కాలం చెల్లవన్నారు. పాత ప్రాజెక్టులు పూర్తి చేయని కేసీఆర్ కృష్ణా వి•ద కొత్త ప్రాజెక్టులు కడతామనడం కూడా ఓ డ్రామానేనన్నారు. ప్రాజెక్టుల వి•ద కేసీఆర్, జగన్‌ల మధ్య రహస్య చర్చలు ఎందుకని ప్రశ్నించారు. కాళేశ్వరం నుంచి ఎన్ని ఎకరాలకు నీరు ఇచ్చావో చర్చకు సిద్ధమా? అని కేసీఆర్‌కు పొన్నాల సవాల్ విసిరారు.
మూర్ఖుడు కేసీఆర్ వాసాల మర్రికి వెళ్లడంలో కూడా స్వార్థం ఉందన్నారు. అక్కడ ఆయన భూములు కొన్నారన్నారు. జగదేవ్ పూర్ వి•దుగా ఫామ్ హౌజ్‌కు వెళ్ళొద్దని సెంటిమెంటు ఉందని…అందుకే వాసాల మర్రి నుంచి ఫామ్ హౌజ్ రోడ్డు వేసుకోవడానికే ఆ గ్రామం వెళ్లారని తెలిపారు. ప్రజలు అది తెలుసుకోలేనంత అమాయకులు కాదని పొన్నాల పేర్కొన్నారు.