Take a fresh look at your lifestyle.

రేవంత్‌ ‌రెడ్డి ఇంటిపై దాడికి టిఆర్‌ఎస్‌ ‌కార్యకర్తల యత్నం

  • అడ్డుకున్న కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు..ఉద్రిక్త పరిస్థితి
  • రంగంలోకి దిగి చెదరగొట్టిన పోలీసులు

పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి ఇంటిని మంగళవారం టీఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలు ముట్టడించడంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. కెటిఆర్‌పై చేసిన వ్యాఖ్యలు, వైట్‌ ‌ఛాలెంజ్‌తో వీరు దాడికి పూనుకున్నారు. దీంతో జుబ్లీహిల్స్‌లోని రేవంత్‌ ‌రెడ్డి ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీనిని అక్కడే ఉన్న కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గొడవ మరింత పెరగడంతో పోలీసులు రెండు వర్గాలను అడ్డుకుని పరిస్థితిని చక్కదిద్దారు. రేవంత్‌ ‌రెడ్డి, కేటీఆర్‌ ‌మధ్య జరుగుతున్న డ్రగ్స్ ‌వార్‌కు సంబంధించి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న విషయం తెలిసిందే.

దీనిపై కేటీఆర్‌, ‌రేవంత్‌పై పరువు నష్టం కేసు వేశారు. దీంతో రేవంత్‌ ‌వ్యాఖ్యలు నిరసిస్తూ టీఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలు రేవంత్‌ ఇం‌టి ముట్టడికి పిలుపిచ్చారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు కూడా రేవంత్‌ ఇం‌టి వద్ద ఉన్న నేపథ్యంలో టీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌కార్యకర్తల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కర్రలు, రాళ్లతో పరస్పర దాడులు చేసుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వారు వినకపోవడంతో స్వల్ప లాఠీ చార్జ్ ‌చేసి..ఇరు వర్గాలను చెల్లా చెదురు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

సీఎం కేసీఆర్‌, ‌మంత్రి కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్‌ ‌రెడ్డి తీరును ఖండిస్తూ రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద టీఆర్‌ఎస్‌వీ నేతలు శాంతియుతంగా నిరసన తెలపడానికి వచ్చారు. దీంతో రెచ్చిపోయిన కాంగ్రెస్‌ ‌గుండాలు టీఆర్‌ఎస్‌వీ నాయకులపై అకారణంగా దాడికి పాల్పడ్డారని టిఆర్‌ఎస్‌ ఆరోపించింది.

Leave a Reply