Take a fresh look at your lifestyle.

బైక్‌పై ఎక్కనన్న మహిళపై హెల్మెట్‌తో దాడి

కేసు నమోదు చేసిన పోలీసులు
చండీఘడ్‌,‌జనవరి7 :హర్యానాలో ఓ వ్యక్తి తన బైక్‌పై వెళ్లేందుకు నిరాకరించిన మహిళను హెల్మెట్‌తో కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సీసీ కెమెరాలో రికార్డు కావడంతో విషయం వెలుగు లోకి వచ్చింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే తనతో పాటు బైక్‌పై రమ్మని కమల్‌ అనే వ్యక్తి.. అక్కడ్నుంచి రోడ్డుపై వెళ్తున్న యువతిని బలవంతం చేశాడు. ఈ క్రమంలో అతనితో వెళ్లేందుకు నిరాకరించిన ఆ మహిళను.. కమల్‌ ‌తన చేతిలో ఉన్న హెల్మెట్‌ ‌తో తీవ్రంగా గాయపర్చాడని గురుగ్రామ్‌ ఏసీపీ మనోజ్‌ ‌తెలిపారు.

ఈ సమయంలో అటువైపుగా ఆటోలో వచ్చిన ఓ వ్యక్తి.. తన వాహనాన్ని ఆపి, ఆమెను రక్షించాడు. అదే సమయంలో మహిళ తన హ్యాండ్‌బ్యాగ్‌తో కమల్‌ అనే వ్యక్తిపై దాడి చేసి, విడిపించుకుంది. ఈ ఘటన జరుగు తుండగానే అక్కడికి చేరుకున్న మరికొంత మంది వ్యక్తులు కమల్‌ ‌నుంచి మహిళను దూరంగా జరిపివేశారు. అనంతరం సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ఐపీసీలోని పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఏసీపీ మనోజ్‌ ‌తెలిపారు.

Leave a Reply