Take a fresh look at your lifestyle.

ఉత్తర్ ప్రదేశ్ లో అమానుషం..! వలస కార్మికుల పై క్రిమి సంహారక స్ప్రే..!

వలస కార్మికుల స్థితిగతులపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన రోజులే ఈ ఘోరం చోటుచేసుకున్నది. ఢిల్లీ నుంచి అష్టకష్టాలు పడి యూపీ చేరుకున్న వలస కార్మికుల కుటుంబాలకు చేదు అనుభవం ఎదురైంది. అందరినీ మూకుమ్మడిగా రోడ్డుపై కూర్చోబెట్టి వారిమీదకు ఆరోగ్యసేవల సిబ్బంది సూక్ష్మక్రిమిసంహారిణులను స్ప్రే చేశారు.
పోలీసులు చూస్తుండగానే ఈ ఘటన జరిగింది. 
మీ కళ్లు మూసుకోండి, పిల్లల కళ్లు మూయండి అని గద్దిస్తూ స్ప్రే చేస్తుంటే వలస కార్మికులు, వారి కుటుంబ సభ్యులు నిస్సహాయంగా కేకలు వేశారు. ఒంటిమీద రసాయనంతో, కళ్లమంటలతో ఇబ్బంది పడ్డారు. బరేలీ జిల్లాలో జరిగిన ఈ అమానుష ఘటనపై సామాజిక మాధ్యమాల్లో గగ్గోలు తలెత్తడంతో జిల్లా యంత్రాంగం వివరణలు ఇచ్చుకోవడం మొదలుపెట్టింది. అమానుషంగా వ్యవహరించాలని కాదు.. అందరి మేలు కోరి అలా చేశాం అని పేలవమైన సంజాయిషీ ఇచ్చుకుంది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!