ఇద్దరు ఆడపిల్లల గొంతుకోసిన తండ్రి
పోలీసులను అభినందించిన ప్రజలు, సిపి
సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని చిట్టాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు ఆడపిల్లల గొంతు కోసి ఓ తండ్రి దారుణానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కన్నతండ్రే ఇద్దరు ఆడపిల్లల గొంతు కోసేశాడు. ఇద్దరు ఆడపిల్లల పరిస్థితి విషమంగా ఉండటంతో… పోలీసులు 108లో సిద్ధిపే• ఏరియా ఆసుపత్రికి ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు భూంపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కలకలం రేపిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని ఖానార్జికి చెందిన దేరెడి మహమ్మద్ కుటుంబం చిట్టాపూర్‌లో ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి రేకులు ఇంటిలో కిరాయికి ఉంటున్నారు. ఇతనికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య జమిరీద్ బీ, రెండవ భార్య మేరజ్. మొదటి భార్యకు ముగ్గురు పిల్లలు ఫయాజ్ కొడుకు, అంజాయన్, అలీనా ఇద్దరు కూతుర్లు రెండవ భార్యకు ఒక కొడుకు. మహమ్మద్‌కు భార్య జమిరిద్ భీ, కుమారుడు ఫయాజ్, కూతుళ్లు అంజాయన్(8), అలీనా(6) ఉన్నారు.
శనివారం ఉదయం ఇంట్లో కుటుంబంలో గొడవ జరగగా…భార్య భీ, కుమారుడు ఫయాజ్ అరుస్తూ ఇంట్లో నుంచి బయటకు వెళ్లారు. ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలు అంజాయన్, అలీనాను మహమ్మద్ చంపే ప్రయత్నం చేస్తున్నారనీ గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్థులు వెం•నే భూంపల్లి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే భూంపల్లి ఎస్ఐ సర్దార్ జమీల్, కానిస్టేబుళ్లు బాల్‌రాజ్, రాజిరెడ్డి, ఏఆర్ కానిస్టేబుల్ రమేష్ పెట్రోలింగ్ వాహనంలో చిట్టాపూర్‌లోని అతని ఇంటికి వెళ్లి ఆడపిల్లలను పిల్లలను ఏమీ చేయొద్దనీ కోరగా మహమ్మద్ అప్పటికే ఇంట్లోకి ఎవరు రాకుండా ఇంటికి గడియ పెట్టుకుని ఎంత చెప్పినా వినకుండా ఇద్దరు పిల్లలను కాళ్ల మధ్యలో పెట్టుకొని కత్తితో చంపేస్తానని బెదిరిస్తూ ఉండగా… వెంటనే పోలీసులు ఎలాగైనా పిల్లల ప్రాణాలు కాపాడాలని దృఢ సంకల్పంతో కానిస్టేబుళ్లు బాల్ రాజ్, రమేష్ డోరు పగలగొట్టి, ఇంటి పై కప్పు రేకులు తీసివేసి ఇంటిలోకి వెళ్లి చూడగా కత్తితో అలీనా గొంతు కోసి ఉండగా, మరో పాప గొంతు కోయడానికి ప్రయత్నిస్తుండగా పట్టుకునే ప్రయత్నంలో బాల్ రాజ్, రమేష్ కు స్వల్పగాయాల య్యాయి. వెంటనే 108 అంబులెన్సులో ఇద్దరు అమ్మాయిలను ఎస్ఐ, సీఐ వెంబడి ఉండి, సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారులిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారి ప్రాణాలకు ఎలాంటి హానీ లేదని డాక్టర్లు ధ్రువీకరించారు. స్వల్ప గాయాలైన బాల్ రాజ్, రమేష్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. పై సంఘటనలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఇద్దరు చిన్నారుల ప్రాణాలు కాపాడినందుకు గ్రామస్తులు, గ్రామ పెద్దలు పోలీసులు చేసిన సాహసాని అభినందించారు.
ఈ సంఘటనపై దుబ్బాక సీఐ హరికృష్ణ గౌడ్ ఏమన్నాడంటే…
నిజాం దేరేడి మహ్మద్(33). మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ఖానార్జి గ్రామం. బతుకు దెరువు నిమిత్తం 15యేండ్ల కిందట మిరుదొడ్డి మండలంలోని మోతెకు వచ్చాడు. ఇతనికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య జమిరీద్ బీ, రెండవ భార్య మేరజ్, మొదటి భార్యకు ముగ్గురు పిల్లలు ఫయాజ్ కొడుకు, అంజాయన్, అలీనా ఇద్దరు కూతుర్లు. రెండవ భార్యకు ఒక కొడుకు. రెండవ భార్య ఆమె కొడుకు మహారాష్ట్ర వెళ్లారు. మొదటి భార్య ముగ్గురు పిల్లలు కలిసి మూడు రోజుల క్రితం మోతే గ్రామం నుండి చిట్టా పూర్ గ్రామానికి వచ్చి రేకుల ఇల్లు కిరాయికి తీసుకుని ఉంటున్నారు. గత మూడు రోజుల నుండి మహ్మద్ మద్యంసేవిస్తూ ఇంట్లో భార్యతో గొడవ పడుతున్నాడు. శనివారం ఉదయ మొదటి భార్య, కొడుకు బయటకు వెళ్లింది గమనించి ఇద్దరి ఆడపిల్లలను చంపే ప్రయత్నం చేయగా భూంపల్లి ఎస్ఐ సర్దార్ జమిల్, కానిస్టేబుళ్లు బాలరాజ్, రాజిరెడ్డి, రమేష్ సరైన సమయంలో వెళ్లి ప్రాణాలకు తెగించి ఇద్దరు పిల్లలు కాపాడారన్నారు. విషయం తెలుసుకున్న పోలీస్ కమిషనర్ డి. జోయల్ డేవిస్ ఇద్దరి ఆడ పిల్లల ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారన్నారు. ప్రాణాలకు తెగించి ఆడ పిల్లల ప్రాణాలను కాపాడిన ఎస్ఐ, కానిస్టేబుళ్లను అభినందించి త్వరలో నగదు రివార్డు అందజేయడం జరుగుతుందని తెలిపారు. నిందితుడైన మహ్మద్ అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించామని సిఐ తెలిపారు.