సూర్యాపేట, సెప్టెంబర్12, ప్రజాతంత్ర ప్రతినిధి): ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయ నిధి నిరుపేదలకు అండ అని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లా క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 67మంది లబ్దిదారులకు 27.75లక్షల చెక్కును అందజేసి మాట్లాడారు. సిఎం సహాయ నిధి ద్వారా ప్రజల్లో ఆర్థిక భరోస, ఆత్మవిశ్వాస కలుగజేస్తుందని, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేసుకున్న పేదవారికి దరఖాస్తు చేసుకున్న వెంటనే తన నిధినుండి విరాళాలుగా ఇస్తున్న విధానమే ఆయన గొప్ప మానవతా దృక్పదానికి ఉదాహరణ అని కొనియాడారు. తన సహాయ నిధి ద్వారా ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ తెలంగాణా ప్రజలకు ఆత్మబందువులా సీఎం కేసీఆర్ నిలుస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపి బడుగుల లింగయ్య యాదవ్, జెడ్పి వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, గ్రంధాలయ సంస్థ చైర్మన్నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, జెడ్పిటిసి జీడి బిక్షం, ఎంపిపి నెమ్మాది బిక్షం, సింగిల్ విండో చైర్మన్ కొణతం సత్యనారాయణతోపాటు పలువురు నేతలుఉన్నారు.
కార్యకర్తలే టిఆర్ఎస్ పార్టీకి పునాది
టిఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం నమోదు చేసుకొని ప్రమాదానికి గురైన ప్రతి ఒక్కరికి బీమా నగదు అందించి, వారి కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు ఇటీవల మరణించిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు 2లక్షల చొప్పున బీమా నగదు అందజేసి మాట్లాడారు. టిఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే గట్టి పునాది అని, కార్యకర్తల కుటుంబ శ్రేయస్సు కోసం కోట్లాది రూపాయలను వెచ్చించి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యకర్తల్లో భరోసా నింపుతున్నారని గుర్తుచేశారు. ఆత్మకూర్ ఎస్ మండల పరిధిలోని కందగట్ల గ్రామానికి చెందిన నూనవత్ పంతులు, పెన్‌పహాడ్ మండల చినగార కుంట తండకు చెందిన దారవత్ మిర్యాలీల కుటుంబాలకు బీమా నగదు అందజేయడం జరిగిందని అన్నారు.