
మహిళలను వేధించే ఆకతాయిల ఆట కట్టించేందుకు షీ టీమ్ ఏర్పడి 5సంవత్సరాలు కావోస్తుంది డిఎస్పి ఆధ్వర్యంలో ఒక ఎస్సై, ఒక మహిళ కానిస్టేబుల్స్, ఇద్దరు పోలీసులతో షీ టీమ్ ఏర్పడ్డ తరువాత పోకిరిల ఆట కట్టించేం దుకు జిల్లా వ్యాప్తంగా సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌లలో ఒకొక్క టీమ్‌గా ఏర్పాటు చేశారు. మహిళల భద్రత కొరకు షీ టీమ్‌లు పనిచేస్తున్నాయి. పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేయడానికే భయపడే మహిళలకు అండగా ఉంటు వారి దగ్గరికి వెళ్లి ఫిర్యాదులు స్వీకరిస్తారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచడమే షీ టీమ్ ప్రత్యేకత. షీ టీమ్ సభ్యులు మఫ్టిలో తిరుగుతు కళాశాలలు, పాఠశాలలు, బస్టాండ్ల వద్ద ఆకతాయిల పనిపట్టేందుకు డేగ కళ్ళతో చూస్తారు. 2014 అక్టొబర్ 24న షీ టీమ్ ఏర్పడింది.
డిఎస్పి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సూర్యాపేటలో విద్యార్థులకు, మహిళలకు అవ గాహన కార్యక్రమాలు, కౌన్సిలింగ్‌లు నిర్వహించారు. ఇలా రాష్ట్ర స్థాయిలో సూర్యాపేట షీ టీమ్ బృందానికి గురువారం రాష్ట్ర టీమ్ అధికారి స్వాతి లక్రా చేతుల మీదుగా హైదరా బాద్‌లో ప్రథమ స్థానం అందుకున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం ఎస్పి క్యాంప్ కార్యాలయం లో ఎస్పి భాస్కరన్‌ను కలిసారు. ఈ సందర్భంగా ఎస్పి షీ టీమ్ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో డిఎస్పి నాగేశ్వరరావు, డబ్య్లూ ఆర్ఎస్సై శ్రావణి, ఏఎస్సై సురేంద్ర బాబు, హెడ్ కానిస్టేబు ల్ బాబు, జ్యోతి తదితరులు ఉన్నారు.