పాట్నా, జూన్ 29 : బీహార్ రాష్ట్రంలో పిడుగు పాటుకు 16 మంది మరణించారు.తూర్పు చంపారన్ జిల్లాలో నలుగురు, భోజ్పూర్, సరన్ జిల్లాల్లో ముగ్గురు, పశ్చిమ చంపారన్, అరారియా, బంకా, ముజఫర్ పూర్లో ఒక్కొక్కరు చొప్పున పిడుగులు పడిమరణించినట్లు బీహార్ అధికారులు చెప్పారు.మృతుల కుటుంబాలకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
ప్రతికూల వాతావరణంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని బీహార్ విపత్తు నిర్వహణ శాఖ జారీ చేసిన ఆదేశాలను పాటించాలని ఆయన సీఎం ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇంట్లో ఉండండి,సురక్షితంగా ఉండండని సీఎం నితీష్ కుమార్ కోరారు. జూన్ 20వతేదీన బీహార్ రాష్ట్రంలో పిడుగుపాటుకు 17 మంది మరణించారు.గత ఏడాది కూడా బీహార్ రాష్ట్రంలో పిడగుపాటుకు వందలాదిమంది మృత్యువాత పడ్డారు.దేశంలోనే బీహార్ రాష్ట్రంలో పిడుగుపాటుకు మరణించిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది.