కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సీఎం భేటీ

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జులై 17: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. గురువారం కేంద్ర రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్వినీవైష్ణవ్‌తో భేటీ అయ్యారు. రేవంత్‌ వెంట మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎంపీలు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, రఘువీర్‌రెడ్డిలు కూడా ఉన్నారు. సుమారు గంటసేపు సాగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు రైల్వే ప్రాజెక్టులపై అశ్వినీవైష్ణవ్‌తో వారు చర్చించినట్లు తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *