కొరోనా భయం మరింత ముసిరినవేళ గిలీడ్ సైన్సెస్ ఫార్మాస్యుటికల్ సంస్థ ప్రకటన కరోనా రోగులకే కాక ప్రపంచ మానవాళికి అభయ హస్తంగా మారుతోంది… తమ పరిశోధనల్లో భాగంగా రెం డెసివిర్ పేరుతో కరోనాను అరికట్టే వ్యాక్సిన్ ను రూపొందించామన్న వార్త సర్వత్రా ఆసలు కలిగిస్తోంది.. దేశాల్ని వణికిస్తూ పాలకులకు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్ ను జయించే ఔషధాన్ని తయారు చేయటం ఖాయమన్న ధీమా శాస్త్రవేత్తలపై ఉన్నప్పటికీ వ్యాక్సిన్ కు ఎంత కాలం పడుతుందోనన్న సందేహముంది.. క్లినికల్ ట్రయల్స్ తదితర అనుమతులు ప్రయోగాలు పరీక్షల నేపద్యంలో వచ్చే అక్టోబర్ నుంచి డిసెంబర్ నెలల్లోపు వ్యాక్సిన్ విడుదలకావొచ్చునేమోనన్న అంచనాలుండగా యు ఎస్ కు చెందిన ఔషధ తయారీ సంస్థ చేసిన ప్రకటన వల్ల అంతకు ముందుగానే కరోనా కట్టడి సాధ్యపడుతుందన్న విశ్వాసాన్ని పెంపొందిస్తోంది…
పూర్తిస్థాయి ప్రయోగాల అనంతరం వ్యాక్సిన్ అందుబాటులోకొస్తే తప్ప కరోనా మహమ్మారిని కట్టడి చేయలేమని భావిస్తున్న తరుణంలో వ్యాక్సిన్ ప్రకటన ఊరటకలిగిస్తోంది..
వినియోగ తుది అనుమతులు ఇంకా రానప్పటికీ రెం డెసివిర్ పట్ల ఆశలు రేకెత్తుతున్నాయి.. మరి కొద్ది రోహుల్లో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్న ఈ వ్యాక్సిన్ ఈ ప్రపంచ చీకటి దశలో తొలికిరణంగా కనిపిస్తోంది.. కరోనా నియంత్రణ పరిశోధనల్లో భాగంగా యునైటెడ్ స్టేట్స్ కు చెందిన బయో ఫార్మాస్యుటికల్ కంపెనీ గిలీడ్ సైన్సెస్ రెం డెసివిర్ అనే వ్యాక్సిన్ ను కనుగొన్న విషయం విదితమే.. కరోనా ను అరికట్టే యుద్ధంలో రెం డెసివిర్ మొదటి అస్త్రంగా మారనుందన్న అభిప్రాయం ఇప్పటికే వ్యక్తమవుతోంది.. ఈ వ్యాక్సిన్ విషయమై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటనేదీ ఇంకా వెలువడకున్నప్పటికీ అంచనాలు మాత్రం పెరిగిపోతున్నాయి.. అనుకున్నట్టు జరిగితే ఈనెలాఖరుకల్లా వినియోగ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్న రెం డెసివిర్ పై కరోనా రోగుల్లో ఆశలు వ్యక్తమవుతున్నాయి.. మహమ్మారి కరోనాను తుదముట్టించే ఔషధంపై అనేక ఊహాగానాలున్నాయి..వ్యాక్సిన్ ముందుగా కరోనా జన్మ స్థానమని భావిస్తున్న చైనా దేశం ఉత్పత్తిచేస్తుందని అమెరికా, భారత్ తదితర దేశాలు సైతం భరోసానిస్తున్నాయి.. ఈక్రమంలో యు ఎస్ నుంచే మొదటి సారిగా కోవిడ్ 19 వ్యాక్సిన్ రానున్నట్టు బలమైన ప్రచారం వ్యాప్తిలోకొచ్చింది.. ఈవ్యాక్సిన్ పై ఫార్మా ల్యాబ్స్ తదితర పలు ప్రయోగాల అనంతరం అమెరికా ఔషధ నియంత్రణ మండలి ( యు ఎస్ ఎఫ్ డీ ఏ) అత్యవసర వినియోగ అనుమతిచ్చింది..ప్రపంచవ్యాప్తంగా 127 దేశాల్లో విస్తరించిన కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే మంది ఆ వ్యాధి బారిన పడగా మంది మృత్యువాత పడ్డారు.. కరోనా చెన్న పెద్ద దేశాల తారతమ్యం లేకుండా రోజురోజుకూ తన పంజా విసురుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా వేలమంది కొత్తగా వైరస్ పాజిటివ్ లవుతున్నారు.. దేశాధినేతలు, రాజకీయ నేతలతోపాటు వైద్యులు , పోలీసులు తదితర రంగాల వారు వైరస్ బారినపడుతుండటంతో సామాన్యులు భయంతో వణికి పోతున్నారు..
మరో వంక కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్సను ప్రైవేట్ పరం చేసి ప్రభుత్వం పక్కకు తప్పుకునే చాయలు వ్యక్తమవుతుండటంతో సాధారణ మధ్యతరగతి, తదితర అల్పాదాయ వర్గాల ప్రజలు భ్యాందోళణలకు గురవు తున్నారు..రెక్కాడితేగాని డొక్కాడే పరిస్థి కావటంతో నిరుపేదలు వేతన జీవులు రోడ్లమీదకు రాకతప్పని స్థితి ఉంది..ఈ పరిస్థితుల్లో వారే అధికశాతంగా కరోనా బారినపడే ప్రమాద ముండటంతో విపరీత ఆందోళణలకు గురవుతున్నారు..ప్రైవేటున వ్యాధి నిర్ధారణకే వేల రూపాయలు వెచ్చించాల్సి ఉండటంతో దేవుడిపైనే భారం మోపుతున్నారు..ఈపరిస్థితుల్లో వ్యాక్సిన్ తయారీ, విడుదల ప్రకటన బాధిత వర్గాలకు అభయంగా మారుతోంది.. యు ఎస్ కు చెందిన ఔషధ సంస్థ తయారు చేస్తున్నప్పటికీ దానిని దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు ప్రపంచవ్యాప్తాన అనేక దేశాలు ముందుకొస్తున్న తీరు చూస్తుంటే వ్యాక్సిన్ పై నమ్మకం మరింత అధికమవుతోంది..
– కె.శ్రీనివాస్ సీనియర్ జర్నలిస్ట్ -9346611455