- వ్యవసాయానికి, అనుబంధరంగాలకు ప్రోత్సాహం
- వ్యవసాయ రంగానికి రూ.25,811కోట్లు
రైతులకు రాష్ట్ర బడ్జెట్ భరోసాను ఇచ్చింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీర్ హరీశ్‌రావు బడ్జెట్‌లో వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చారు. వ్యవసా యం, వ్యవసాయ అనుబంధ రంగాలకు పెద్ద మొత్తంలో రూ.25,811కోట్లు కేటాయించి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకు న్నది.రైతులకు పెట్టుబడిగా పేరుగడించిన రైతుబంధు పథకానికి రూ.14వేల కోట్లు కేటాయించారు.2019-20 బడ్జెట్‌లో రైతుబంధు పథకానికి రూ.12వేలు కేటాయించారు.ఈ ఏడాది అదనంగా రూ.2వేలు ఎక్కువగా ఇచ్చారు. సాగు విస్తీర్ణం పెగడంతో పాటు పెండింగ్‌లె•ఓ చాలా పాస్‌బుక్‌పస్తకాలను రైతులకు అందజేశారు. ఈ కారణంతో ఎక్కువమంది రైతులకు రైతుబంధును ఇవ్వాల్సి ఉంటుందనే అంచనాలతో రూ.2వేలు అదనంగా కేటాయించినట్లు రాష్ట్ర ఆర్థికశాఖ ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు.
గతేడాది ఐదుఎకరాలకు ఎక్కువగా ఉన్న చాలా మంది రైతులు రైతుబంధును అందుకోలేక పోయారు. దీనితో రాష్ట్ర ప్రభుత్వంపైన విమర్శలు వచ్చాయి. రైతుబందును అందుకునే రైతుల సంఖ్య ఇంకా పెరగనున్నదని ప్రభుత్వ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. రైతుబీమా పథకానికి రూ.1141కోట్లు కేటాయించా రు.18 సంవత్సరాల నుంచి 60 ఏండ్ల వరకు ఎంత చిన్న మొత్తం ఉన్న రైతుకైనా రైతుబీమా వర్తించేవిధంగా నిబంధనలను సరళతరం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ రైతులకు బీమాను చెల్లిస్తున్నది. ఏడాదికి ప్రతీరైతుకు రూ.2271చొప్పును ప్రీమియం చెల్లిస్తున్నారు. దురదృష్టవశాత్తు రైతుమరణిస్తే, పదిరోజుల్లో రూ.5లక్షల పరిహారం లభించేవిధంగా చర్యలు తీసుకుంటున్నారు. అయితే రైతుల మరణాలు ఉండనే ఉండకూదదని తెలంగాణ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఆర్థికమంత్రి శాసనసభలోనే స్ఫష్టంచేశారు. లక్షలసంఖ్యలోని రైతులు ఎదురుచూస్తున్న రుణమాఫీపైన ప్రభుత్వం స్ప్టష్టతను ఇచ్చింది. రూ.25వేల లోపు ఉన్న రుణాలను మార్చి చివరి నాటికి చెల్లించేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రతీ నియోజకవర్గంలో మంత్రులు, శాసనసభ్యులు రూ.25వేల లోపు ఉండే రుణాలకు సంబంధించిన రైతులకు చెక్కులు అందించనున్నారు. మార్చి, ఏప్రిల్ మాసాలలో ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. లక్షలోపు రుణాలను దశలవారీగా చెల్లించనున్నారు. రైతుల జాబితాలను రూపొందించాల్సిందిగా బ్యాంకులకు ఆర్థికశాఖ విజ్ఞప్తి చేసింది.2014లో రుణాలు తీసుకున్న రైతుల సంఖ్య అత్యధికంగా ఉండటం, వెంటనే రైతులకు రుణసదుపాయం లభించాలనే లక్ష్యంతో 2014-15లోరుణమాఫీ కోసం రూ16,124కోట్లు చెల్లించారు. క్రమంగా రైతుల బకాయిలు చెల్లించనందున ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.6225కోట్లు రుణమాఫీకోసం కేటాయించారు. అయితే రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు చెల్లించాల్సిన రుణాలకు ఈ మొత్తం సరిపోదనే విమర్శ ఉన్నది కూడా. కాగా 25 వేలలోపు రూపాయలవరకు రుణాలను చెల్లించేందుకు రూ.1198 కోట్లు విడుదల చేయనున్నారు.పంటల కొనుగోటులకు అత్యవసరఫండ్ తరహాలో రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ స్కీం ప్రవేశపెట్టారు. తెలంగాణలో పండుతున్న వరి,పత్తి,మక్కజొన్న, కందులు, వంటి పంటలకు గిట్టుబాటు ధర లభించేవిధంగా, రైతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఇంటర్వెన్షన్ స్కీం విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ విధానం కోసం బడ్జెట్‌లో రశ్రీనూ.1000 కోట్లు కేటాయించారు.కేంద్ర ప్రభుత్వం పంటలను కొనుగోలు చేయడంలో సీలింగ్ విధానాన్ని అమలు చేస్తున్నది. రైతులకు మద్దతు ధర ఇచ్చి,మార్కెట్‌లోకి వచ్చిన పంటలన్నింటినీ కొనుగోలు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ విధానం. అందురే ఇటీవల కందులకు గిట్టుబాటు ధర రూ.5800లు నిర్ణయించినప్పటికీ, కేంద్రం 50వేల క్వింటాళ్లు మాత్రమే కొంటామని సీలింగ• విధించింది.రాష్ట్రంలో లక్ష క్వింటాళ్లకుపైగా కందులు పంట వచ్చినట్లు వ్యవసాయశాఖ పేర్కొన్నది. ఇటువంటి పరిస్థితులను అధిగమించేందుకు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం ఉపయోగపడనున్నది.
మైక్రోఇరిగేషన్‌ను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ స్కీంకోసం రూ..600కోట్లు కేటాయించారు.విత్తనాల సబ్సిడీకి రూ.142కోట్లు ఇచ్చారు. తెలంగాణలోని కందివిత్తనాలకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఏర్పడింది.పాడిరైతుల ప్రోత్సాహం కోసం రూ.100కోట్లు ఇచ్చారు.వ్యవసాయానికి ఉచితంగా 24గంటల పాటు విద్యుత్తు సరఫరా చేస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వంపైన రూ.5వేలకోట్ల భారం పడుతున్నది. కాళేశ్వరం నుండి నీటిని తోడేందుకు వినియోగిస్తున్న భారీ మోటార్ల భారం రాష్ట్రంపైన పడుతున్నది,..అయినప్పటికీ, ఈ భారం రైతలపైన మోపమని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరాఖండిగా చెప్పారు. సాగునీటి రంగానికి రూ.11054కోట్లు ఖర్చు చేయనున్నట్లు బడ్జెట్‌లో ఇచ్చారు. వచ్చే ఖరీఫ్ నాటికి మరో •ఐదు లక్షల ఎకరాలు సాగులోకి వచ్చే విధంగా ఉత్తర దక్షిణ తెలంగాణాలోని చెరువులన్నింటినీ నింపేవిధంగా చిన్ననీటిపారుదలశాఖ అధికారులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.ఈ కారణాలన్నింటితో వ్యవసాయం తెలంగాణలో పండుగఅవుతున్నది.
Tags: Telangana Rice, cotton, maize, cowpea, etc